సీఎం వైఎస్ జగన్ పర్యటన విజయవంతం చేయాలి..


Ens Balu
3
Eluru
2020-10-31 20:49:38

నవంబర్ 4న రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి ఏలూరు పర్యటనను విజయవంతం చేయాలని డిప్యూటీ సీఎం, వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఏలూరులో  నూర్బాష దూదేకుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఎంఆర్ పెదబాబు, జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలు రాజు, ఎస్పీ నారాయణ నాయక్, ఎమ్మెల్యే  కొఠారి ఆబ్బయ్య చౌదరితో  సమీక్షనిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సీఎం వైఎస్ జగన్ పెళ్లి శుభకార్యానికి వస్తున్నారన్నారు.  ఏలూరు తంగెళ్లమూడి వంతెన ఉన్న సూర్య కల్యాణ మండపాన్ని పరిశీలించి, పెదబాబు  ఇంటిని సందర్శించారు. సీఎం పర్యటన విజయవంతంగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని  ఎస్పీని ఆదేశించారు. ఈ కార్యక్రమములో ఏలూరు డీస్పీ, ఆర్డీఓ ఏలూరు నగర  వైస్సార్సీపీ నాయకులు  తదితరులు పాల్గొన్నారు.