పౌరసేవల్లో అలసత్వం సహించేది లేదు..


Ens Balu
4
Chandragiri
2020-10-31 20:53:07

గ్రామ /వార్డు సచివాలయాల్లో పౌర సేవలను విస్తృతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) వి. వీరబ్రహ్మం ఆదేశించారు. శనివారం మద్యాహ్నం చంద్రగిరి లోని 1, 2 వ వార్డు సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జెసి సచివాలయంలో కార్యదర్శుల వారీగా సచివాలయంలో అమలు చేసిన పౌర సేవల రిజిస్టర్ను పరిశీలించారు. ఈ  సందర్భంగా కార్యదర్శులను ఉద్దేశించి జె సి మాట్లాడుతూ పౌర సేవలను మరింత విస్తృతంగా అమలు చేయాలన్నారు. ప్రజల నుంచి అందిన దరఖాస్తులను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలన్నారు. సచివాలయం ద్వారా వీలైనన్ని ఎక్కువ సర్వీసులను సకాలంలో అందించాలన్నారు. సచివాలయంలో అందుతున్న సర్వీసులను సద్వినియోగం చేసుకునేలా స్థానిక ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యదర్శుల రోజువారీ విధుల నిర్వహణపై సమీక్షించారు. అడ్మిన్, విఆర్వో, పారిశుధ్య పర్యావరణ కార్యదర్శుల రోజువారీ విధుల నిర్వహణ ఎలా చేస్తున్నారంటూ సంబంధిత కార్యదర్శులతో మాట్లాడారు. గృహాల నుంచి తడి, పొడి చెత్త విధానంలో సేకరించాలన్నారు. పౌర సేవల సంఖ్యను పెంచడానికి నిత్యం అడ్మిన్ కార్యదర్శులతో  సమీక్ష నిర్వహిస్తున్నామని మున్ముందు మరింత వేగంగా సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు.