సహచట్టం దరఖాస్తులు మరిన్ని పెరగాలి..


Ens Balu
4
Anakapalle
2020-11-01 18:15:33

అవినీతిని అంతమొందిస్తూ.. దాపరికంలేని సమజాన్ని నిర్మించడానికి సమాచార హక్కు దరఖాస్తు దారుల సంఖ్య పెరుగుదలకు  యునేటెడ్ ఫోరం ఫర్ ఆర్.టి.ఐ క్యాంపెయిన్ కార్యకర్తలు కృషి చేస్తుందని యూ.ఎఫ్.ఆర్.టి.ఐ రాష్ట్ర కో కన్వీనర్ బుద్ధ చక్రధర్ స్పష్టం చేశారు. ఆదివారం సి.పి.ఎం కార్యాలయంలో యూ.ఎఫ్.ఆర్.టి.ఐ అద్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  ప్రజలకు వజ్రాయుధం గా ఉండాల్సిన ఆర్.టి.ఐ ను అధికారులు నిర్వీర్యం చేస్తున్నారన్నారు. దీనిపై సమాచార హక్కు చట్టం కార్యకర్తలు పోరాటం చేస్తున్నారని తెలిపారు. అలాగే స.హ కార్యకర్తలు సేకరించిన సమాచారాన్ని ఉద్యమ కారులతో కలిసి సమస్య పరిస్కారం దిశగా ప్రయత్నం చేయాలన్నారు. అడిగిన సమాచారం ప్రజా ప్రయోజనార్థం అయి ఉంటే దానికోసం అప్పీలు,ఆ పై కమిషన్ కు వెళ్ళేవరకు ఆ దరఖాస్తు ను ముందుకు తీసుకు వెళ్లాలని సూచించారు. దీనితో పాటు కాపులు తూర్పు, కొండ అని  బి.సి డి గా కుల ధ్రువీకరణ పత్రాలు పుట్టించి  సర్టిఫికెట్ లు తీసుకొంటున్నారని దానిపై స.హా కార్యకర్తలు దృష్టి సారించాలని కోరారు. అనంతరం మరో ముఖ్య అతిథిగా విచ్చేసిన యూ.ఎఫ్.ఆర్.టి.ఐ విశాఖ జిల్లా ప్రధాన సలహాదారు దండు గణపతి రాజు  మాట్లాడుతూ యూ ఎఫ్.ఆర్.టి.ఐ రాష్ట్ర కమిటీ తరపున సమాచార హక్కు చట్టం బలోపేతానికి నా వంతు కృషి చేస్తానన్నారు. సమాచార హక్కు కమీషన్ ను ఏర్పాటుచేయడంలో ఎన్. సి.పి.ఆర్.ఐ కీలక పాత్ర పోషించిందన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్.టి.ఐ ని నిర్వీర్యం చేసే విధంగా ప్రయత్నం జరుగుతుందన్నారు. ఆర్.టి.ఐ ని బతికించాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు.ఈ చట్టం ప్రజల కోసం పనిచేసే చట్టం అని గుర్తు చేశారు.అనంతరం జిల్లా కమిటీ సభ్యులకు అధికారుల నుండి సమాచారం సేకరించడంలో తీసుకోవలసిన పలు జాగ్రత్తలు, సలహాలు ,సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యూ.ఎఫ్.ఆర్.టి.ఐ జిల్లా కన్వీనర్ రాజాన బుజ్జిబాబు,కో కన్వీనర్ లు బి.వి.వి సత్య నారాయణ,కాండ్రేగుల రాము స.హా చట్టం కార్యకర్తలు నరసింహ,రమేష్,కొల్లి చిన అప్పారావు,పిట్ట అప్పారావు,సోమిరెడ్డి రాజు తదితరులు పాల్గొన్నారు.