పొట్టి శ్రీరాములను ఆదర్శంగా తీసుకోవాలి..


Ens Balu
2
ఆంధ్రాయూనిర్శిటీ
2020-11-01 18:41:47

ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఆంధ్రవిశ్వవిద్యాలయంలో ఘనంగా  ఆదివారం నిర్వహించారు. వర్సిటీ పరిపాలనా భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి పాల్గొని, పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ప్రసాదరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రరాష్ట్రం కోసం ప్రాణాలను అర్పించిన పొట్టి శ్రీరాములు త్యాగాన్ని నేటితరం గుర్తుచేసుకోవాలన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు నాంది పలికిన మహనీయులు పొట్టి శ్రీరాములు అని, తెలుగు వారి కోసం రాష్ట్ర ఏర్పాటుకు తన ప్రాణాలను సైతం త్రుణప్రాయంగా వదిలిన పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. ఆయనను ప్రతీ ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అనంతరం అధికారులకు, సిబ్బందికి రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.