డిగ్రీ ఫైనల్ ఇయర్ ఫలితాలు విడుదల..
Ens Balu
4
ఆంధ్రాయూనివర్శిటీ
2020-11-01 18:56:18
ఆంధ్రవిశ్వవిద్యాలయం డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు యూజీ పరీక్షల డీన్ ఆచార్య డి.వి.ఆర్ మూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఏయూలో మీడియాతో మాట్లాడుతూ, మొత్తం 24328 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా.. 16651 మంది ఉత్తీర్ణతతో 68.44 శాతం ఉత్తీర్ణత నమోదయిందన్నారు. బి.ఏ (సిబిసిఎస్) లో 85.86, బిబిఏ(సిబిసిఎస్)లో 94.75,బిసిఏ(సిబిసిఎస్)లో 85.71, బిహెచ్‌ఎంసిటి(సిబిసిఎస్)లో 95.12, బిఎస్సీ(సిబిసిఎస్)లో 62.28, బికాం సిఏఎస్‌లో70.58, బికాం జనరల్‌లో 80.41 శాతం ఉత్తీర్ణతను సాధించారు. పరీక్షల ఫలితాలను ఏయూ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. అభ్యర్ధులు వారి హాల్ టిక్కెట్లు ఆధారంగా ఫలితాలను చెక్ చేసుకోవచ్చునన్నారు. త్వరలోనే ఉత్తీర్ణత సాధించిన వారికి ప్రొవిజినల్, ఓడి, మైగ్రేషన్ సర్టిఫికేట్లు రెడీ చేయనున్నట్టు ఆయన చెప్పారు. ఆ తేదీలను కూడా ఏయూ వెబ్ సైట్లోనూ, మీడియా ద్వారా ప్రకటిస్తామని ఆయన వివరించారు.