సచివాలయ బదిలీలపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు..


Ens Balu
4
కలెక్టరేట్
2020-11-01 19:41:23

అనంతపురం జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శులకు సంబంధించి ఎలాంటి బదిలీలు జరగడం లేదని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు  స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, సచివాలయాల కార్యదర్శిలకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని కలెక్టర్ తెలియజేశారు.  కార్యదర్శుల బదిలీలు జరుగుతున్నాయన్నది పూర్తిగా తప్పుడు సమాచారమన్న కలెక్టర్  దీన్ని ఎవరు నమ్మవద్దని అన్నారు. ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు రెండేళ్ల ప్రొహిబిషన్ పిరియడ్ పూర్తయ్యేవరకూ ఎలాంటి బదిలీలు జరగవన్నారు. అదే సమయంలో దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా రాష్ట్రప్రభుత్వం నుంచి రావాల్సివుంటుందన్నారు. ఇవేమీ లేకుండా కొందరు కావాలనే సోషల్ మీడియాలో సచివాలయ ఉద్యోగులకు బదిలీలు జరుగుతున్నాయని ప్రచారం చేస్తున్నారని ఈ విషయంలో ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈ ఒక్క సమాచారంతో చాలా మంది దళారులు సొమ్ముచేసుకునే అవకాశం వుందన్నారు. అలా ఎవరైనా దళారులను ఆశ్రయిస్తే నష్టపోతారని కలెక్టర్ హెచ్చరించారు.