ప్రెస్ అకాడమీ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి..


Ens Balu
2
Gandikota
2020-11-01 19:54:04

జర్నలిస్టుల్లో నైపుణ్యాలు  పెంచేందుకు ప్రెస్ అకాడెమీ నిర్వహించే శిక్షణా తరగతులను ఉపయోగించుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడెమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి  కోరారు. అనంతపురం జిల్లా  తాడిమర్రి మండలం, దాడితోట గ్రామాన్ని ఆదివారం సందర్శించారు. చిత్రావతి రిజర్వాయర్, గండికోట రిజర్వాయర్ లను పరిశీలించేందుకు కడప జిల్లాలో పర్యటించిన దేవిరెడ్డి.. కడప-అనంతపురం సరిహద్దులో ఉన్న దాడితోట గ్రామంలోని తన అత్తవారింటికి విచ్చేసారు. మాజీ మంత్రి జి. నాగిరెడ్డి ఇంట పాత్రికేయులతో మాట్లాడారు..గ్రామాల నుంచి జర్నలిజం వృత్తిని ఎంచుకోవాలనుకునే యువకులకు ప్రెస్ అకాడెమీ నుంచి ఆర్థిక సాయం అందిస్తామన్నారు. త్వరలో అనంతపురం జిల్లా జర్నలిస్టులకు ఆన్లైన్ లో శిక్షణా తరగతులను నిర్వహిస్తామన్నారు. కోవిడ్ బారిన పడ్డ జర్నలిస్టులకు ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. అందువల్లే కోవిడ్ కారణంగా మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.5 లక్షలు పరిహారం ప్రభుత్వం అందించాలని నిర్ణయం తీసుకుందన్నారు.  జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు.