పరిపాలన వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివ్రుద్ధి..


Ens Balu
3
కలెక్టరేట్
2020-11-01 20:00:50

పరిపాలన వికేంద్రీకరణతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్థి లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ చార్జి మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. మహనీయుల త్యాగాల ఫలితంగా తొలి భాషా  ప్రయుక్త రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్  ఏర్పడిందన్నారు. ఆదివారం నాడు స్థానిక కలెక్టరు కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన నగరంలో రూ. 14000 కోట్లతో  లైట్ మెట్రో ప్రాజెక్ట్ , రూ. 7000 కోట్లతో మోడ్రన్ ట్రామ్  ప్రాజెక్టులు వస్తున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి  నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలు పథకంలో వై.ఎస్.ఆర్.రైతు భరోసా, జగనన్న విద్యా దీవెన, డా. వై.ఎస్.ఆర్. ఆరోగ్యశ్రీ, వై.ఎస్.ఆర్ జలయజ్ఞం, మద్యపాన నిషేధం అమలు చేస్తున్నామని అన్నారు.  అమ్మఒడి పథకంలో జిల్లాలో  5.75 లక్షల  విద్యార్థుల యొక్క 3,91,822 మంది తల్లుల బ్యాంకు ఖాతాలలో రూ. 587.73 కోట్లు జమ చేశారన్నారు. వై.ఎస్.ఆర్ ఆసరా మొదటి విడతగా సెప్టెంబరు 11వ తేదీన 6,61,317 మందికి రూ. 459.43 కోట్లు వారి బ్యాంకు ఖాతాలో జమచేయడం జరిగిందన్నారు. పేదలందరికీ ఇల్లు అనే ప్రతిప్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నం జిల్లాలో 2,53,173 మంది అర్హులైన లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయుటకు అన్ని  చర్యలు తీసుకోవడమైనదని అన్నారు. ఈ కార్యక్రమం కోసం 1439.08 ఎకరముల అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమితో పాటు 299.87 ఎకరాల అసైన్డ్ భూమిని మరియు  84.43 ఎకరాలు పట్టా భూ సేకరణ ద్వారానూ, అర్బన్ లో 4457.05 ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్ భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించడమైనదన్నారు. అతి త్వరలో అర్హులైన అక్కా చెల్లెమ్మలందరికీ ఇళ్ల పట్టాలు అందజేయబడతాయన్నారు. వై.ఎస్.ఆర్ ఫించన్ల పథకం క్రింద జిల్లాలోని 4,87,208 మంది పించనదార్లకు సుమారుగా రూ. 117.75 కోట్ల నిధులు ప్రతీ నెలా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. వై.ఎస్.ఆర్ చేయూత మొదటి విడతగా  ఆగష్టు నెలలో  జిల్లాలో గల 1,86,312 మంది లబ్దిదారులకు రూ. 348.65 కోట్లు వారి ఖాతాలలో జమ చేయడం జరిగిందన్నారు.  వై.ఎస్.ఆర్ నవశకం లో భాగంగా వై.ఎస్.ఆర్ మత్స్యకార భరోసా లో  20,273 మత్స్యకార కుటుంబాలకు రూ. 20.27 కోట్లు బదలాయించుట జరిగిందన్నారు.  వై.ఎస్.ఆర్ సున్నా వడ్డీ పథకం , వై.ఎస్.ఆర్ నేతన్న నేస్తం  పథకం, వై.ఎస్.ఆర్.రైస్ కార్డు, వై.ఎస్.ఆర్ వాహన మిత్ర పధకం, వై.ఎస్.ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు, జగనన్న వసతి దీవెన, వై.ఎస్.ఆర్ కాపు నేస్తం, జగనన్న చేదోడు,  జగనన్న విద్యా కానుక,  జగనన్న తోడు, ఎమ్ .ఎస్.ఎమ్.ఇ-రీస్టార్ట్ ప్యాకేజి, వై.ఎస్.ఆర్ జలకళ పథకాలు అమలు చేస్తున్నామన్నారు.  అటవీ హక్కు పత్రాల పంపిణి లో భాగంగా 48,053 మంది గిరిజన రైతులకు 74,479.88 ఎకరాల అటవీ హక్కు పత్రాలు పంపిణీ చేసామన్నారు. రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ చరిత్రను మరచిపోకుండా మహనీయుల స్పూర్తితో అందరం నడుద్దామని అన్నారు. విశాఖ నగరం అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిందని అన్నారు. అధికార భాషా సంఘం అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ , ప్రయివేటు పాఠశాలలలో తెలుగును తప్పనిసరిగా భోదించాలని ముఖ్యమంత్రి  ఆదేశించారని అన్నారు.  జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ మాట్లాడుతూ గ్రామ స్థాయిలో ప్రజలకు పరిపాలన చేరువ చేయడానికి సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసారన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా పార్లమెంటు సభ్యులు బి.వి.సత్యవతి, నగర పోలీస్ కమీషనర్ మనీష్ కుమార్ సిన్హా, రూరల్ ఎస్.పి.బి.కృష్ణారావు ప్రసంగించారు.  తొలుత రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ చార్జి మంత్రి కురసాల కన్నబాబు  జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసారు. తెలుగు తల్లి చిత్ర పటానికి , అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పుష్పాంజలి సమర్పించారు. అనంతరం మా తెలుగు తల్లి ప్రార్థనా గీతం ఆలపించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు యం.వి.వి.సత్యనారాయణ, శాసన సభ్యులు గొల్ల బాబురావు, కన్నబాబు రాజు, జి.అమర్ నాథ్, ఎ.అదీప్ రాజు, జాయింట్ కలెక్టర్లు వేణు గోపాలరెడ్డి, అరుణ్ బాబు, గోవిందరావు, జి. వి.యం.సి. కమీషనర్ జి.సృజన, వి.యం.ఆర్.డి.ఎ. కమీషనర్ కోటేశ్వరరావు, డి.ఆర్.ఒ.ఎ.ప్రసాద్, ఆర్.డి.ఒ.పి.కిషోర్ , ఇతర జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.