ప్రజా సేవల్లో జాప్యాన్ని సహించేది లేదు..
Ens Balu
2
Tirupati
2020-11-02 19:19:43
వార్డు సచివాలయాలు ప్రజలకు సేవలందించడంలో ముందుండాలని, సచివాలయంలో పౌర సేవలు విస్తృతంగా చేయాలని కమీషనర్ గిరీష ఆకస్మిక తనిఖీ నిర్వహించి సిబ్బందికి దిశ నిర్దేశం చేశారు. సోమవారం ఎంఆర్ పల్లి లోని క్రిష్ణ నగర్ లో ఉన్న వార్డ్ లో గల1,2 సచివాలయాలను నగర పాలక . సచివాలయం నోటిస్ బోర్డులో ప్రదర్శించిన అమ్మ ఒడి, వై ఎస్సార్ ఆరోగ్య శ్రీ , పెన్షన్ కానుక, వైయస్సార్ బీమా, జగనన్న తోడు అర్హుల జాబితాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రజల సంక్షేమ పథకాలు సకాలంలో అందించడానికి, కావలసిన ధృవ పత్రాలు సకాలంలో మంజూరు వంటివి, అన్ని సర్వీసు సకాలంలో అందించాలని అలాగే పన్నుల సేకరణ ఆలస్యం లేకుండా చూడాల్సిన బాధ్యత మీపై వుందన్నారు. ప్రజలకు సేవలు తెలిసే విధంగా నోటీస్ బోర్డులపై అన్ని పథకాలు ఉండాలని సూచించారు. సచివాలయం సిబ్బంది డ్రెస్ కోడ్ పాటించాలని, మొన్నటి వరకు కాలేజ్ స్టూడెంట్ అని నేడు ప్రభుత్వ ఉద్యోగులు అని, డ్రెస్ కోడ్ లేకపోతే ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదని సున్నితంగా హెచ్చరించారు. సచివాలయ సిబ్బందిని విధుల పురోగతిపై ప్రశ్నించారు. మీ సేవా కేంద్రాల్లో అందిస్తున్న అన్ని సేవలు కచ్చితంగా వార్డు సచివాలయం అందించాలని ఆదేశించారు. దరఖాస్తు చేసుకున్న వారికి అవగాహన కల్పించాల్సిన బాధ్యత మీదినాని, వైఎస్ఆర్ బీమా, జగనన్న తోడు వంటి సంక్షేమ పథకాలు లబ్ధిదారుల ఎంపిక ఎలా చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు, నగరంలో ప్రతి ఇంటికి యూజర్ చార్జీలు స్వైపింగ్ మిషన్ తోనే వసూలు చేయాలని, వార్డు సచివాలయ సిబ్బంది చేయాలని, వార్డు సచివాలయ వచ్చే ప్రజలకు సమస్యలు వెంటనే పరిష్కరించాలని, ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు అర్హులకు పారదర్శకంగా అందించాలని, నవంబర్ 6వ తేదీ జగనన్న తోడు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రారంభిస్తారు ,ఈ లోపల అన్నీ పూర్తి చేయాలని సచివాలయ సిబ్బందికి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వారితోపాటు అదనపు కమిషన్ హరిత, సూపర్డెంట్ రవి, వెటర్నరీ డాక్టర్ రవికాంత్, ఈ ఆర్ పి వెంకటేష్ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.