స్వచ్ఛ సర్వేక్షణ్ లో తిరుపతి మొదటిగా నిలవాలి..
Ens Balu
1
Tirupati
2020-11-02 19:26:29
స్వచ్ఛ సర్వేక్షన్ 2021 తిరుపతి నగరపాలక సంస్థను నిలిపేందుకు అధికారులు మరింత శ్రమించాలని ఏస్బీఐ డీజీఎం గిరిధర్ స్వామినాధన్ పేర్కొన్నారు. నగరపాలక సంస్థ లలిత కళా ప్రాంగణం లో కమిషనర్ గిరీష అధ్యక్షతన సోమవారం సాయంత్రం ఎస్బిఐ డీజీఎం, ఏజీఎంలు స్వచ్చ సర్వేక్షన్ 2021 భాగంగా ప్లాస్టిక్ నిషేధం కొనసాగింపు భాగంలో, ప్రతి ఇంటికి గుడ్డ సంచులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు 25 వేల సంచులు నగరపాలక సంస్థ తిరుపతి నగరపాలక సంస్థలోని శానిటరీ ఇన్స్పెక్టర్ లకు, హెల్త్ సెక్రటరీలకు 25000 గుడ్డ సంచులను అందజేశారు. అనంతరం డీజీఎం, కమిషనర్ గిరీష మాట్లాడుతూ, తిరుపతిలో ప్లాస్టిక్ నిషేధం లో భాగంగా ప్రతి ఇంటికి గతంలో గుడ్డ సంచులు అందజేయాలని ప్రణాళిక చేసామని, అందులో కొంతమందికి ఇవ్వడం జరిగిందని, మధ్యలో కోవిడ్ 19 కారణంగా లేకపోయినా మని నేడు ఎస్ బి ఐ సహకారంతో యూజర్ చార్జీలు సక్రమంగా చెల్లించిన ఇళ్లకు ఎస్ బి ఐ వారు స్వచ్ఛ సర్వేక్షన్ 2021 కి సంబంధించి ముద్రించిన సంచి బ్యాగులు అందజేయడం జరుగుతుందని తెలియజేశారు. ఎస్బిఐ డి జి యం మాట్లాడుతూ మన తిరుపతి స్వచ్ఛ సర్వేక్షన్ 2021 ముందు వరుసలో నిలుపుటకు ఎస్ బి ఐ ఉద్యోగాలు ముందుంటారని, ప్రతి ఒక్కరికి అవగాహన నిర్వహిస్తామని, శ్రీ శక్తి సంస్థ ద్వారా సంచులు కుట్టించి కొనుగోలు చేసి నగర పాలకు భాగస్వాములు చేయడం చాలా సంతోషమని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సమావేశంలో కమిషనర్ వారితోపాటు ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వర రెడ్డి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచీలు డీజీఎం గిరిధర్, స్వామినాథన్, కృష్ణ బాలాజీ, ఏజీఎం లక్ష్మి, శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి,శానిటరి ఇన్స్పెక్టర్లు, హెల్త్ సెక్రెటరీలు తదితరులు పాల్గొన్నారు.