ప్రజలకు సత్వరం సేవలందించాలి..
Ens Balu
3
Vizianagaram
2020-11-02 19:30:02
వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు సత్వర సేవలు అందించాలని జాయింట్ కలెక్టర్(ఆసరా, సంక్షేమం) జె.వెంకటరావు సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. విజయనగరం పట్టణంలోని పలు వార్డు సచివాలయాలను జెసి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాలీఘాట్ కాలనీ, ఉడా కాలనీల్లో ఉన్న సచివాలయాలను ఆయన సందర్శించి, రికార్డులను పరిశీలించారు. సిబ్బంది హాజరుపట్టికను తనిఖీ చేశారు. ఆయా సచివాలయాల ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. ఇ-రిక్వెస్టులు, స్పందన వినతుల స్థితిగతులపై సిబ్బందిని ప్రశ్నించారు. ప్రజలు వినతులు అందించిన వెంటనే, వాటిని పరిశీలించి, పరిష్కారానికి ఆయా శాఖలకు పంపించాలని సూచించారు. రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులకు వచ్చే వినతులపై తక్షణమే స్పందించి, అర్హులకు వెంటనే జారీ చేయాలని సూచించారు. సక్రమంగా, సకాలంలో సేవలను అందించి, ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాలని ఈ సందర్భంగా జెసి కోరారు.