విద్యాసంస్థల్లో కోవిడ్ నిబంధనలు అమలు చేయాలి..


Ens Balu
3
కలెక్టరేట్
2020-11-02 19:33:38

పాఠశాలలు కళాశాలలో ప్రభుత్వం జారీ చేసిన  కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని జిల్లా కలెక్టరు వి వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో    నిర్వహించిన  జిల్లాస్థాయి టాస్క్ ఫోర్స్ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ  విద్యార్థులు ఒక్కసారిగా పాఠశాలలో  ప్రవేశిస్తున్నందున వారిని క్రమశిక్షణలో ఉంచాలని సామాజిక దూరాన్ని పాటించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. పాఠశాలకు వచ్చిన ప్రతి విద్యార్థిని పరీక్ష చేయాలన్నారు. మాస్కులు ధరించడం చేతులు శుభ్రపరచుకోవడం పై వారికి కచ్చితమైన ఆదేశాలు ఇవ్వాలన్నారు. పాఠశాల గదులను బస్సులను క్షుణ్ణంగా శానిటేషన్ చేయించాలన్నారు.  మధ్యాహ్న భోజన పథకం విషయంలో కూడా కచ్చితమైన నిబంధనలు  పరిశుభ్రత  పాటించాలన్నారు. ఈ విషయంలో రాజీ పడకూడదు అన్నారు. ప్రతిరోజూ వెయ్యి మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించాలని,  పీహెచ్సీ పరిధిలో కనీసం వంద పరీక్షలు జరగాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు.  ముఖ్యంగా ఇంటర్ మీడియట్ విద్యార్థినీ విద్యార్థుల విషయంలో క్రమశిక్షణ లో కఠినంగా ఉండాలని, ఎక్కువ ఉత్సాహంగా ఉంటారు కాబట్టి ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.  జిల్లాలో వివిధ పాఠశాలలు కళాశాలల్లో విద్యార్థుల హాజరు ని గూర్చిన నివేదికలు ప్రతిరోజూ సమర్పించాలన్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కోవిడ్ వ్యాపించే ప్రమాదం ఉందని గ్రహించాలని  ఇదే విషయాన్ని  విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు.   పాఠశాలలు కళాశాలల్లో ప్రతిరోజు తనిఖీలు నిర్వహించాలన్నారు.  ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్  పి అరుణ్ బాబు ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి ఎస్ వెంకటేశ్వర్ జిల్లా విద్యాశాఖ అధికారి బి.లింగేశ్వల రెడ్డి, ఉప రవాణా కమిషనర్ జి.సి. రాజరత్నం, డియంఅండ్ హెచ్ వో డాక్టర్ పి.ఎస్. సూర్యనారాయణ, ఆర్. ఐ.ఓ. బి సుజాత, సాంఘిక సంక్షేమ శాఖ డి డి  డి.వి. రమణ మూర్తి గిరిజన సంక్షేమశాఖ డిడి  విజయలక్ష్మి, డిప్యూటీ డిఇఓ నాగమణి, డైట్ ప్రిన్సిపాల్ జ్యోతి కుమారి తదితరులు పాల్గొన్నారు.