సైనిక్ స్కూలు ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం..
Ens Balu
1
Srikakulam
2020-11-02 19:38:17
ఆల్ ఇండియా సైనిక స్కూల్ లో ప్రవేశాలకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సీనియర్ డైరక్టర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్స్-2021 వారు 6 వ తరగతి, 9వ తరగతిలో ప్రవేశాలకు జనవరి 10వ తేదీన ఎంట్రెన్స్ పరీక్షను నిర్వహించనున్నట్లు డైరక్టర్ తెలిపారు. దేశంలోని 33 సైనిక పాఠశాలలో ప్రవేశాలకు అవకాశం వుంటుందన్నారు. ఈ ఎగ్జామినేషన్ వ్రాత పరీక్ష ద్వారా నిర్వహించడం జరుగుతుందని, ఇందులో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు వుంటాయని తెలిపారు. 6 వ తరగతిలో ప్రవేశాలు బాలికలకు మాత్రమే అవకాశం వుంటుందని, వారు 31.03.2021 నాటికి 10 నుండి 12 సం.లలోపు వయస్సు కలిగి వుండాలని తెలిపారు. 9 వ తరగతిలో ప్రవేశానికి 13 నుండి 15 సం.లలోపు వయస్సు కలిగి వుండి, 8 వ తరగతి ఉత్తీర్ణత కలిగి వుండాలని సదరు ప్రకటనలో తెలియచేసారు. ఎస్.సి. ఎసి.టి.లు పరీక్ష ఫీజు రూ.400/- లు మరియు యితరులకు రూ.550/-లు చెల్లించవలసి వుంటుంది. యితర వివరాలను www.nta.ac.in ద్వారా తెలుసుకోవచ్చునని తెలిపారు. అభ్యర్ధులు https://aissee.nta.nic.in ద్వారా ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవలసి వుంటుందని, అక్టోబరు 20 నుండి నవంబరు 19 వ తేదీ లోగా దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. పరీక్ష ఫీజు ఆన్ లైన్ ద్వారా అనగా డెబిట్/క్రెడిట్ కార్డులు కాని, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కాని, పేటిఎం ద్వారా కాని చెల్లించవలసి వుంటుందని తెలిపారు. ఎంట్రన్స్ పరీక్షలోని మార్కులు, మెడికల్ ఫిట్ నెస్ ల ఆధారంగా ప్రవేశాలు జరుగుతాయని తెలిపారు. చిరునామా వివరాలు: బ్లాక్ సి -20, 1 ఎ/బి, ఐఐటికె ఔట్ రీచ్ సెంటర్, సెక్టార్ 62, నొయిడా, గౌతం బుధ్ధ్ నగర్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్-201 309.