నరేగా నిర్మాణాలు మరింత వేగవంతం..
Ens Balu
2
కలెక్టరేట్
2020-11-02 19:56:25
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో చేపట్టిన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ వినయ్ చంద్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామ ఆరోగ్య కేంద్రాలు సచివాలయాలు అంగన్వాడీలో నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. అదే క్రమంలో రోడ్ల నిర్మాణం, సామగ్రి కొనుగోళ్ళు ఉండాలని సూచించారు వీలైనంత వేగంగా పనులను పూర్తి చేయాలని, మంజూరు చేసిన నిధులను ఖర్చు పెడుతూ పనులను పురోగమింప చేయాలని ఆదేశించారు. ప్రణాళిక ప్రకారము నిర్మాణాలు ఖర్చు ఉండాలని, అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని, మందకొడిగా సాగినా చర్యలు తప్పవని హెచ్చరించారు. మొత్తం అభివృద్ధి పథకాలకు ఇచ్చిన నిధులను సకాలంలో ఖర్చు చేస్తేనే అభివృద్ధి ఫలాలు అందరికీ అందుతాయని గుర్తించాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి అరుణ్ బాబు ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి ఎస్ వెంకటేశ్వర్, పంచాయతీ రాజ్ ఎస్ఈ సుధాకర్ రెడ్డి, డ్వామా పథక సంచాలకులు సందీప్, గృహ నిర్మాణ శాఖ పీడీ జయరామ ఆచారి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రవికుమార్ ఇతర ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.