పుష్కరాలకు వారం ముందుగా పనులు పూర్తికావాలి..


Ens Balu
4
తుంగభద్ర ఘాట్
2020-11-02 20:14:25

కర్నూలు జిల్లాలో నవంబర్ 20 నుండి డిసెంబర్ 1 వరకు నిర్వహించనున్న పవిత్ర తుంగభద్ర నది పుష్కరాలకు వారం రోజుల ముందుగానే ఘాట్ ల నిర్మాణ పనులు పూర్తిచేయాలని రాష్ట్ర జలవననుల శాఖ మంత్రి డా.పి.అనిల్ కుమార్ ఆదేశించారు సోమవారం  నగరంలోని పెద్ద మార్కెట్ రాఘవేంద్ర మఠం దేవాలయం పుష్కర ఘాట్, కర్నూలు-హైదరాబాద్ జాతీయ రహదారి పై గల మునగల పాడు పుష్కర ఘాట్ ల లో జరుగుతున్న నిర్మాణ పనులు, సౌకర్యాలను, ఏర్పాట్లును  ఆయన జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ తో కలిసి పరిశీలించారు. పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన తుంగభద్ర నది పుష్కరాలు విజయవంతం కావాలంటే అన్ని సౌకర్యాలు పూర్తికావాల్సిన అవసరం వుందన్నారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ చొరవ తీసుకోవాలన్నారు. అదేవిధంగా ఇంజనీరింగ్ పనుల్లో నాణ్యత తగ్గినా సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలన్నారు.. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, పాణ్యం శాసన సభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే జె.సుధాకర్, కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ డి.కె. బాలాజీ, ఇంచార్జి ఎస్ పి గౌతమి సాలి, జె డి సీఈఓ వెంకటసుబ్బయ్య, వివిధ శాఖల ఇంజనీరింగ్ ఎస్ ఈ లు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు..