సమస్య పరిష్కారం కాకపోతే నిలదీయండి..


Ens Balu
3
బందరు
2020-11-02 20:56:10

ప్రజాభాగస్వామ్యంతో  పల్లెల సమగ్రాభివృద్ది సాధ్యమవుతుందని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) అన్నారు. సోమవారం ఉదయం ఆయన  సోమవారం ఆయన బందరు మండలం పోతిరెడ్డిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో 79 లక్షల 30 వేల రూపాయల వ్యయంతో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, ఆరోగ్య కేంద్ర భవనాలకు శంఖుస్థాపన చేశారు. అనంతరం గ్రామసభ నిర్వహించారు. నన్ను నిలదీయాల్సిన సమస్యలు మీ ఊర్లో ఏమైనా ఉన్నాయా ? అని గ్రామస్తులను ప్రశ్నించి  స్థానిక సమస్యలను తనదైన శైలిలో అడిగి తెలుసుకొన్నారు.  గ్రామంలో అంగన్వాడీ భవనం కావాలని గ్రామస్తులు కోరారు.  ఈ విషయమై స్పందించిన మంత్రి పేర్ని నాని ఆ భవన నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో  తెలియచేయాలని  ఏ ఇ ను అడిగారు. 8 లక్షల రూపాయల వ్యయం అవుతుందని ఆ అధికారి తెలిపారు. ఎన్ ఆర్ జె ఎస్ నిధుల కింద ఆ నిర్మాణంకు నిధులు మంజూరు చేస్తానని ఎస్టిమేషన్ ఇవ్వాలని కోరారు. అలాగే విద్యార్థిని విద్యార్థుల సంఖ్య  పెరగడంతో పాఠశాల భవనం ఇరుకుగా ఉంటుందని రెండు గదులు నిర్మించితే పిల్లలకు సౌకర్యవంతంగా ఉంటుందని గ్రామస్తులు మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఆ రెండుగడుల నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో తెలియచేయాలని ఏ ఇ తోట లక్ష్మే నారాయణను అడిగారు.. ఒక్కో గది నిర్మాణానికి 2 లక్షల రూపాయల వరకు వ్యయం కానున్నట్లు ఆయన తెలిపారు. సార్వాకు సాగునీలు వస్తుందా అని రైతులను ఉద్దేశించి మంత్రి వాకబు చేశారు.  వెంటనే కొందరు రైతులు పంట కాలువ ప్రవాహాన్ని అడ్డుకొంటూ ఎగువ ప్రాంతాలలో రైతులు , చేపల పెంపకందార్లు నీటిని మళ్లిస్తూ ఎవరికివారు అక్రమ తూములు నిర్మించుకొంటున్నారని దాంతో దిగువకు నీరు పారని పరిస్థితి ఏర్పడిందని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. తక్షణమే ఆ ప్రాంతాలను తనిఖీ చేయాలనీ తూములు ఎక్కడెక్కడ ఊన్నాయి ? ఏ ఏ సైజులలో అక్కడ ఎవరెవరు ఏర్పాటుచేసుకొన్నారోనన్న వివరాలతో సిద్ధంగా ఉండాలని వచ్చే వేసవికాలం నాటికి ఆ అక్రమ తూములు ఏమీ లేకుండా చేయాలనీ  నీటిపారుదల అధికారి మురళికు మంత్రి ఆదేశించారు.  తన తల్లి పక్షవాతంతో ఎంతో ఇబ్బందిపడుతుందని ఆమెకు పింఛన్ వచ్చే అవకాశం ఉందా  అని మంత్రిని అభ్యర్ధించింది. వికలత్వం పరిశీలించి సెర్టిఫికెట్ ఇచ్చే సదరం స్లాట్ మొదలైందని అక్కడ ఇచ్చే పత్రం ద్వారా పింఛన్ మంజూరైతే నెలకు 5 వేలు వస్తుందని అన్నారు. ఆమెను అక్కడకు ఎలా తీసుకురావాలని ఒక వ్యక్తి అడగ్గా  అంబులెన్సు లో రప్పించకూడదా ? అని మంత్రి జవాబు ఇచ్చారు.  గ్రామంలో  వీధి దీపాలు సరిగా వెలగడం లేదని గుడ్డి దీపాలు మాదిరిగా చీకట్లో కనిపిస్తున్నాయని ఒక గ్రామస్తుడు తెలిపాడు.  లోవోల్టేజ్  సమస్య అరికట్టాలని విద్యుత్ అధికారులను సూచించి , విద్యుత్ స్తంభాలకు నంబర్లు రాయకపోవడం చేత ఏ స్థంభం వద్ద వీధి దీపం వెళదాం లేదోనన్న సంగతి ఎలా చెబుతారని మంత్రి ప్రశ్నించారు.  పొట్లపాలెం గ్రామం ముఖద్వారం వద్ద నివసించే చొప్పరపు నాగేశ్వరరావు తమ ఇంటి సమీపంలో ఉన్న వీధిదీపం వెలిగి నెలలు కాలం అయిందని మంత్రికి ఆరోపించారు. ఈ గ్రామసభలో మచిలీపట్నం  మాజీ జెడ్ పీ టీ సి సభ్యులు లంకె వెంకటేశ్వరరావు ( ఎల్వీయార్ ) ,  మచిలీపట్నం తహసీల్దార్ సునీల్ బాబు, పోతిరెడ్డిపాలెం గ్రామ సర్పంచ్ మేకా లవ కుమార్( నాని ) , రురల్ ఎస్ ఐ ఎన్ ఎల్ ఎన్  మూర్తి,  వి ఆర్వో ప్రసాద్,  నాగబాబు , మరియన్న,  ఆర్ ఐ  యాకూబ్ , హోసింగ్ , విద్యుత్ , ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.