ప్రజలకు జాప్యం లేని సేవలందాలి..
Ens Balu
1
చట్టివానిపాలెం
2020-11-02 20:59:59
వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు జాప్యం లేకుండా సేవలు అందాలని జివిఎంసీ కమిషనర్ డా.స్రిజన సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. సోమవారం జివిఎంసి పరిధిలోని చట్టివాని పాలెం 60వ వార్డు సచివాలయాన్ని ఆమె ఆకస్మిత తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని సచివాలయాన్ని సందర్శించి ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పధకాల జాబితాను పరిశీలించారు. సచివాలయ కార్యదర్శులు జాబు చార్టు పరంగా వారు నిర్వహించే విధులను గురుంచి అడిగి తెలుసుకున్నారు. వారు పనిచేసే పనిని పరిశీలించే నిమిత్తం వారి హాజరు, మూమెంట్ రిజిస్టర్, డైరీ మొదలైనవి పరిశీలించి, ప్రజలకు అందుబాటులో ఉంచాలని వారి సేవలు ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ఉండాలని కార్యదర్శులను ఆదేశించారు. సచివాలయ పరిధిలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు పెట్టుకున్న ఆర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి వాటిని త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం, శ్రీహరిపురం లోని గుల్లలపాలెం పార్కు నందు స్విమ్మింగ్ పూల్ ప్రతిపాదనలను పరిశీలించారు మరియు ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలోని పెవిలియన్ మరమ్మత్తు పనులను పరిశీలించి పనులు వేగవంతం చేయాలని ఇంజినీరింగు అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో పర్యవేక్షక ఇంజినీరు రాజా రావు, అయిదవ జోనల్ కమిషనర్ శ్రీధర్, కార్యనిర్వాహక ఇంజినీర్లు వేణుగోపాల్, మెహెర్ బాబా, ఉప కార్యనిర్వాహక ఇంజినీర్లు ప్రసాద బాబు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.