నేషనల్ హైవే బైపాస్ పై స్టాపర్లు..


Ens Balu
3
Tirupati
2020-11-03 15:39:51

జాతీయ రహదారుల్లో ప్రమాదాలను నియంత్రించేందు తిరుపతి అర్భన్ జిల్లా పోలీసులు వినూత్న ప్రయోగం చేపట్టారు. నేషనల్ హైవే, బైపాస్ రోడ్లలో ముఖ్యమైన ప్రదేశాల్లో స్టాపర్లను ఏర్పాటు చేశారు. తద్వారా వాహనాల వేగాన్ని తగ్గించడంతోపాటు, ప్రమాదాల సంఖ్యను తగ్గించవచ్చునని తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి  ఏ.రమేష్ రెడ్డి  చెబుతున్నారు. లాక్ డౌన్ సడలింపు తరువాత అధికంగా వాహనాలు రోడ్లపై వస్తున్న సందర్భంలో హైవే మార్గం ద్వారా పట్టణ  ప్రాంతాలకు, గ్రామీణ ప్రాంతాలకు డైవర్ట్ అయ్యే సందర్బంలో తరచు ప్రమాదాలను గమనించి ఈ ఏర్పాట్లు చేశారు.  తిరుపతి అర్బన్ జిల్లా అంతట బైపాస్ ల నుండి డైవర్ట్ అయ్యే ప్రాంతాలు, అదిక మలుపు గల ప్రదేశాలను గుర్తించి అక్కడ బ్యారికేట్స్, స్టాపర్స్, మార్కింగ్లు చేసినట్టు ఎస్పీ వివరించారు. అంతేకాకుండా ఈ ప్రాంతాల్లో ప్రత్యేక సిబ్బందిని కూడా ఏర్పాటు చేశామన్నారు. అనునిత్యం వీటిని పర్యవేక్షిస్తున్నట్టు ఎస్పీ వివరించారు.