విధినిర్వహణలో తేడాలొస్తే ఇంటికే..
Ens Balu
2
Rapthadu
2020-11-03 16:35:49
అనంతపురం జిల్లాలోని రాప్తాడు మండల పరిధిలోని హంపాపురం గ్రామ సచివాలయాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ ఏ.సిరి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండల ఈవో ఆర్డీ మాధవీలత, ఎంఈఓ మల్లికార్జున పంచాయతీ సెక్రెటరీ చరణ్ గ్రామ వాలంటరీలు మాత్రమే హాజరయ్యారు. మిగతా ఉద్యోగులు గైర్హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామ సచివాలయ రికార్డులను పరిశీలించారు ఉద్యోగులు విధులకు సరిగ్గా హాజరు కావడం లేదని మందలించారు గ్రామ వాలంటరీలు మాస్కులు తప్పని సరిగా ధరించాలన్నారు లేనిపక్షంలో విధులకు హాజరు కావద్దన్నారు. ఉద్యోగుల హాజరు రిజిస్టర్ అస్తవ్యస్తంగా ఉండడంతో మందలించారు ఆర్డీవో కి ఫోన్ చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అలాగే రాప్తాడు మండల వ్యాప్తంగా సచివాలయాల్లో విఆర్వోలు సరిగా విధులకు హాజరు కావడం లేదు అంటూ మండిపడ్డారు వన్ బి అడంగల్ మినహా మిగతా ఆన్ లైన్ సేవలు ప్రజలకు అందించకపోవడాన్ని తప్పు పట్టారు ప్రతి సచివాలయంలోను ఇదే సమాధానం చెబుతున్నారు మిగతా సేవలు ఎందుకు అందించడం లేదని ప్రశ్నించారు? రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసింది ప్రజలకు అన్ని సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది కానీ సచివాలయ ఉద్యోగస్తులు ప్రజలకు సరైన సమాచారాన్ని తెలియ చేయకపోవడం,ఆన్ లైన్ సేవలు అందించకపోవడం సరైన పద్ధతి కాదన్నారు ఇలాగే కొనసాగితే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.