పాఠశాలల్లో కోవిడ్ నిబంధనలు పాటించాలి..
Ens Balu
2
Rapthadu
2020-11-03 16:37:22
ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభించిన నేపథ్యంలో అన్ని పాఠశాలలోనూ కోవిడ్ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ( గ్రామ, వార్డు సచివాలయాలు మరియు అభివృద్ధి)ఏ.సిరి ఆదేశించారు. మంగళవారం రాప్తాడు మండలం లోని హంపాపురం ఎంపీయూపీ పాఠశాలను జెసి పరిశీలించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ విద్యార్థులు కోవిడ్ బారిన పడకుండా రక్షించేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు ఎలా భోదిస్తున్నారు అనే విషయం పై ఆరా తీశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో జెసి మాట్లాడారు. అంతకుముందు హంపాపురం గ్రామ సచివాలయాన్ని జెసి సిరి పరిశీలించారు. రిజిస్టర్ లను, ఉద్యోగుల హాజరు పట్టికను తనిఖీ చేశారు. సచివాలయానికి వచ్చే ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని చేసి సచివాలయ ఉద్యోగులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు, ఎంపీయూపీ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.