విద్యాసంస్థలు టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి..
Ens Balu
2
ఆంధ్రాయూనివర్శిటీ
2020-11-03 16:53:41
విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థుల ప్రగతిపై ప్రత్యేక దృష్టిసారించాల్సిన అవసరం ఉందని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. మంగళవారం దాడి వీరు నాయుడు కళాశాల వార్షిక సంచిక, వెబ్‌సైట్‌లను ఆయన తన కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా విసి మాట్లాడుతూ, విద్యాసంస్థలు నాణ్యతా ప్రమాణాలతో విద్యనందించాలన్నారు. కళాశాలలు, విద్యాసంస్థలు వెబ్ సైట్లు ఏర్పాటు చేసుకోవడం ద్వారా విద్యార్ధులకు ఎలాంటి సమాచారమైనా తక్షణమే అందించడానికి వీలుపడుతుందన్నారు. టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యాసంస్థలు ముందుకు సాగాలన్నారు. ఆ విషయంలో దాడివీరునాయుడు కళాశాల మంచి ప్రగతి సాధిస్తుందని కితాబునిచ్చారు. విద్యాసంస్థ యొక్క సమస్త సమాచారం వెబ్ సైట్ లో పొందుపరచడం ద్వారా విద్యార్ధులకు ఉపయుక్తంగా వుంటుందని విసి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏయూ రెక్టార్ ఆచార్య కె.సమత, ఇంచార్జి రిజిస్ట్రార్ ఆచార్య జి.రవీంద్రనాథ్ బాబు, విద్యాసంస్థల చైర్మన్ దాడి రత్నాకర్, కళాశాల ప్రిన్సిపాల్ కె. రమేష్ తదితరులు పాల్గొన్నారు.