గిరిజనుల నిధులను పూర్తిస్థాయిలో వినియోగించాలి..


Ens Balu
2
కలెక్టరేట్
2020-11-03 17:08:39

గిరిజనుల కోసం కేటాయించిన నిధులు శత శాతం వారికోసమే ఖర్చు జరిగేలా  చూడాలని జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్ లాల్ అధికారులకు ఆదేశించారు.  అనేక పథకాల అమలులో మనం  ముందున్నామని , అదే స్పూర్తిని  గిరిజనుల సంక్షేమం లో కూడా  చూపించాలని అన్నారు.   సమర్ధవంతమైన గ్రామ సచివాలయ వ్యవస్థ  పని చేస్తోందని, ప్రతి ఇంటికి వెళ్లి లబ్ది పొందని గిరజునులకు లబ్ది పొందేలా చూడాలి అన్నారు.  మంగళవారం కలక్టరేట్ ఆడిటోరియంలో గిరిజన ఉప ప్రణాళిక  పై జిల్లా మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో 2019-20, 202౦-21  సంవత్సరాలలో నిర్దేశించిన లక్ష్యాలను, ప్రగతిని ప్రాజెక్ట్ అధికారి ఆర్. ఉర్మనాథ్ తో కలసి కలెక్టర్ సమీక్షించారు.  గిరిజన ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న సచివాలయయాల పోస్టులను త్వరగా నింపాలని జిల్లా పరిషత్ సి .ఈ.ఓ కు  సూచించగా ఈ నెల 5 నుండి దరఖాస్తుల పరిశీలన ఉందని,  11నాటికీ పోస్టులన్నీ నియమించడం జరుగుతుందని  సి.ఈ.ఓ వెంకటేశ్వర రావు తెలిపారు.           వ్యవసాయ, అనుబంధ  రంగాలపై గిరిజనులకు అన్ని రకాల సహకారం అందేలా చూడాలన్నారు.  ఏ ఒక్క రైతుకు రైతు భరోసా లబ్ది పెండింగ్ ఉండకూడదని అన్నారు.  రెండు రోజులు పార్వతీపురం లో ఉండి  ఇంటితటికి వెళ్లి సర్వే  చేసి  ప్రతి రైతు  కవర్ అయ్యేలా చూడాలని వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు ఆశ దేవిని ఆదేశించారు.  అలాగే గిరిజన రైతులు పండించే తృణ ధాన్యాలను ఎగుమతి చేసుకునేల వారికి  మార్కెటింగ్ స్కిల్ల్స్ ను నేర్పించాలన్నారు.  అందుకోసం వచ్చే మూడేళ్ళకు ప్రణాళిక తయారు చేసుకోవాలన్నారు.  వారు పండించే పంటలకు  జాతీయ మార్కెటింగ్ లో  నిలిచే ప్రమాణాలు ఉండాలని, ఆ విధంగా వారికీ అవగాహన, శిక్షణలు  కల్పించాలని అన్నారు.  ప్రతి గ్రామానికి తాగు నీటి ప్రాజెక్టులు , రహదారులు ఉండాలని,  విద్యుత్ లేని గ్రామం, వార్డ్  ఉండకూడదని అన్నారు.  ఏ గ్రామం అయనా  విద్యుత్ లేకుండా ఉన్న, లో వోల్టేజ్  సమస్య ఉన్న  మండల ప్రత్యేకాధికారులు గుర్తించి విద్యుత్ శాఖాధికారికి  వివరాలను అందజేయలన్నారు. గిరిజన  రైతులందరికీ అవసరమైన   మోటర్లు ఇవ్వాలని, అవసరమైతే అదనపు  ట్రాన్స్ ఫార్మర్ లను కూడా ఏర్పాటు చేయాలనీ కలెక్టర్ విద్యుత్ శాఖ ఎస్.ఈ. విష్ణు కు ఆదేశించారు.           గర్భిణీల వివరాలు ముందే తెలుస్తాయి కనుక వారి ప్రసవానికి ముందస్తు ఏర్పాట్లను గావించాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. రమణ కుమారికి సూచించారు.  డోలి లలో గర్భిణీలను తీసుకు వెళ్ళడం, దారిలోనే  ప్రసవాలు జరగడం చూస్తున్నామని, అలంటి పరిస్థితి నుండి బయట పడాలని అన్నారు.  గర్భిణీల  కోసం మహిళా హోస్తేల్స్ ను   నాణ్యత ప్రమాణాలతో నిర్వహించాలని  అన్నారు. గర్భిణీలను నిరంతరం పర్యవేక్షిస్తూ వారిని హాస్పిటల్ లో కానీ, వసతి గృహం లో కానీ ఉంచి సుఖ ప్రసవం జరిగే వరకు  వారిని పర్యవేక్షిన్చాలన్నారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ద్వార గిరిజన ప్రాంతాల్లో సంపూర్ణ పోషణ్ ప్లస్ పథకం అమలు జరుగుతోందని, ఈ పథకం  ద్వార శిశువుల, తల్లుల ఆరోగ్యాన్ని పరీక్షించాలని  తద్వారా వారిలో అనారోగ్య సమస్యలుంటే ముందుగానే గుర్తించ వచ్చని అన్నారు.  అలా గుర్తించిన వివరాలతో   ప్రతి మూడు నెలలకోసారి మధ్యంతర నివేదికనందించాలని ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజేశ్వరి కి ఆదేశించారు.  అటవీ శాఖ ద్వారా పచ్చదనాన్ని పెంచడమే కాకా గ్రిజనులకు వాణిజ్య పరంగా ఉపయోగ పడే మొక్కలను పెంచేలా చూడాలని అటవీ శాఖాధికారులకు సూచించారు.  గుమ్మిడి  గెడ్డ ప్రాజెక్ట్ కోసం నిధులు రాబట్టడానికి లేఖ రాయాలని జలవనరుల శాఖాధికారులకు సూ చించారు.             తొలుత పార్వతీపురం  ఐ.టి.డి.ఎ  ప్రాజెక్ట్ అధికారి  ఆర్. కుర్మనాథ్ మాట్లాడుతూ  ప్రతి శాఖ తన నిధుల్లో 6.6 శాతం గిరిజన అభివృద్ధికి ఖర్చు చేయాలనీ, అయితే కొన్ని శాఖలు ఇంకను  వారి లక్ష్యాన్ని చేరుకోలేదని అన్నారు. జిల్లా కలెక్టర్ గారి దిశా నిర్దేశం లో  రాష్ట్రం లోనే అత్యధికంగా 50 వేల  అటవీ హక్కుల పట్టాలను అందించాగలిగామని, అదే స్పూర్తి తో మిగిలిన పథకాలను కూడా గిరిజనులకు అందేలా కృషి చేయాలనీ అధికారులను కోరారు. లబ్ది దారుల వద్దకే వెళ్లి అటవీ హక్కుల పట్టాల అర్హులను గుర్తించామని, , వాలంటీర్ ల సహాయం తో  ప్రభుత్వ పథకాలు గిరిజనులకు చేర్చడం లో లక్ష్యాలను సాధించాలని అన్నారు.            ఈ సమావేశం లో జిల్లా అటవీ అధికారి సచిన్ ,సహాయ కలెక్టర్ సింహాచలం, జిల్లా అధికారులు, మున్సిపల్ కమీషనర్ లు తదితరులు హాజరైనారు.