గిరిజనుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి..
Ens Balu
2
Srikakulam
2020-11-03 19:59:02
గిరిజనుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. బూర్జ మండలం వైకుంటపురం గ్రామంలో మూడు లక్షల వ్యయంతో నిర్మించిన సిసి రోడ్లను సభాపతి మంగళవారం పంపిణీ చేసారు. అల్లిపల్లి గూడ గ్రామంలో గిరిజనులకు అటవీ హక్కుల చట్టం క్రింద పట్టాలను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులు భూమిపై ఆధారపడతారని, వేరే వృత్తులపై ఆధారపడరని అన్నారు. అందుకే గిరిజనులకు రెండు ఎకరాల భూమి చొప్పున పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. నాగరికతకు దూరంగా బ్రతుకుతున్న గిరిజనులను ఆదుకునే మంచి ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర చరిత్రలో గిరిజనులకు పట్టాలు అందించి వ్యవసాయం చేసుకోవడానికి హక్కు కల్పించడం జరిగిందని పేర్కొన్నారు. ఆమదాలవలస నియోజకవర్గంలో గిరిజన గ్రామలకు సరైన రహదారి సౌకర్యం కల్పించుటకు ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టనున్నట్లు ఆయన చెప్పారు. గిరిజన గ్రామాల్లో సోలార్ సిస్టం ద్వారా త్రాగునీరు కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఎ పిఓ సి.హెచ్.శ్రీధర్, ఆర్.డి.ఓ ఐ.కిశోర్, సరుబుజ్జిలి బూర్జ తహశీల్దార్లు, ఎంపీడీవోలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.