ఇవిఎం గొడౌన్ల‌ను త‌నిఖీ చేసిన క‌లెక్ట‌ర్‌..


Ens Balu
1
Nellimarla
2020-11-04 16:23:44

విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని నెల్లిమ‌ర్ల‌లోని ఇవిఎంలను భద్రపరిచిన గొడౌన్ల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్ బుధ‌వారం ప్రత్యేకంగా త‌నిఖీ చేశారు. గొడౌన్ల‌ను వేసిన సీళ్ల‌ను, అక్క‌డి భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌ను, రికార్డుల‌ను ప‌రిశీలించారు. అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గోడౌన్లను పర్యవేక్షించే సిబ్బంది ఎప్పటికప్పుడు ఈ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తక్షణమే సమాచారాన్ని తనకు చేరవేయాలన్నారు. అదే సమయంలో వీటి నిర్వహణను రెవిన్యూ అధికారులు పర్యవేక్షించాలని కూడా ఆదేశించారు.  ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గ‌ణ‌ప‌తిరావు, మండ‌ల తాశీల్దార్ గొట్టాపు రాము, ఎంపిడిఓ కె.రాజ్‌కుమార్‌, ఇత‌ర రెవెన్యూ అధికారులు, సిపిఐ నాయ‌కులు తాలాడ స‌న్నిబాబు, బిఎస్‌పి నాయ‌కులు పాండ్రంకి వెంక‌ట‌ర‌మ‌ణ త‌దిత‌రులు పాల్గొన్నారు.