దోమల నియంత్రణపై అవగాహన కల్పించాలి..


Ens Balu
2
Visakhapatnam
2020-11-04 18:50:58

మహానగర విశాఖపాలక సంస్థ పరిధిలో అన్ని ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచేందకు ప్రతీ ఒక్కూ సహకరించాలని  అదనపు కమిషనర్ డాక్టరు వి. సన్యాసి రావు పిలుపునిచ్చారు. బుధవారం జివిఎంసి మూడవ జోన్ పరిధిలో 19వ వార్డులోని పారిశుద్ధ్య పనులను ఆయన పరిశీలించారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా మూడవ జోనల్ కమిషనర్ బి. సన్యాసినాయుడుతో కలసి 19వ వార్డులోని పలు ప్రాంతాలను  పర్యటించారు. కాలువలను, రోడ్లను పరిశీలించి కాలువలలో చెత్త వేయకుండా ప్రజలను చైతన్యవంతం చేయాలని శానిటరీ అధికారులను ఆదేశించారు. కాలువలలోని చెత్త ఎప్పటికప్పుడు తీసి, రోడ్లను శుభ్రంగా ఉంచాలని శానిటరీ అధికారులను ఆదేశించారు. తడి-పొడి చెత్త సేకరిస్తున్నదీ లేనిదీ  శానిటరీ కార్మీకులను అడిగితెలుసుకున్నారు. స్థానిక ప్రజలతో మాట్లాడుతూ ఇంటి పరిసరాల పరిశుభ్రతపై శ్రద్ధ వహించాలని నీటి నిల్వలు లేకుండా చూడాలని కోరారు.   వార్డు కార్యదర్శుల జాబ్ చార్టును అడిగి తెలుసుకొంటూ, సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, ప్రతీ ఇంటిని తనిఖీ చేసి దోమల నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.  బాకాయిలో ఉన్న ట్రేడ్ లైసెన్సుల ఫీజులను శతశాతం వసూలు చేయాలని శానిటరీ ఇన్స్పెక్టర్ నకు  ఆదేశించారు.  ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ బి. సన్యాసి నాయుడు, ఇంచార్జ్ శానిటరీ సూపర్వైజర్ రాజు,    శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస రావు, వార్డు సచివాలయ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.