ప్రభుత్వ భవనాల గ్రౌండింగ్ పూర్తికావాలి..


Ens Balu
1
Anantapur
2020-11-04 19:19:48

అనంతపురం జిల్లాలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఈ నెల ఏడో తేదీ మధ్యాహ్నం లోపు రైతు భరోసా కేంద్రాలు, అంగన్వాడి కేంద్రాలు, వైయస్సార్ హెల్త్ క్లినిక్లు, గ్రామ , వార్డు, సచివాలయాల భవనాలకు చెందిన స్థలాల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి , నిర్మాణాలను ప్రారంభించాలని  జిల్లా కలెక్టర్ గంధం  చంద్రుడు సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం  స్థానిక కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్ నందు జాయింట్ కలెక్టర్(ఆర్ బి కె అండ్ ఆర్) నిశాంత్ కుమార్ , జేసీ (సంక్షేమం మరియు ఆసరా)గంగాధర్ గౌడ్ వ్యవసాయశాఖ జెడి ,ఆర్ డబ్ల్యు ఎస్,పంచాయత్ రాజ్ , ఎస్ ఈలు ,జెడ్పీ సి ఈ ఓ లతో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ జూమ్  వీడియో కాన్ఫరెన్స్ పాల్గొన్నారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాలు, అంగన్వాడి కేంద్రాలు, వైయస్సార్ హెల్త్ క్లినిక్లు, గ్రామ , వార్డు, సచివాలయాల భవనాల నిర్మాణాలకు  సంబంధించి పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్లు, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లు,  వ్యవసాయ అధికారులు, వైద్యాధికారులు, ఐసిడిఎస్ అధికారులు, తహసీల్దార్లు, సమన్వయంతో పని చేయాలన్నారు.  అన్నింటికీ స్థలాలను గుర్తించి, శనివారం లోపు నిర్మాణాల పనులను ప్రారంభించాలన్నారు. ఇందుకోసం గ్రామ, మండల, డివిజన్, జిల్లా స్థాయిలో సంబంధిత  శాఖల అధికారులందరూ ఈ నిర్మాణాల పనులు ప్రారంభించేలా ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఇప్పటికే గ్రౌండింగ్ పూర్తయిన పనుల్లో పురోగతి చూపడంతో  పాటు, కాని పనులు గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్థలాల ఎంపికకు సంబంధించి   ఆర్డీవోలు, తహశీల్దార్లు  అవసరమైన చోట  భవనాల నిర్మాణాలకు స్థలాలను వెంటనే స్వాధీనం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు..స్థలాల ఎంపిక ప్రక్రియలో ఏవైనా సమస్యలు ఎదురైతే తన  దృష్టికి తీసుకుని వస్తే దానిని పరిశీలించి తగు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు.. ఇసుక సమస్య  కూడా లేకుండా చూడాలని ఆదేశించారు.  నిర్లక్ష్యం వహించే అధికారులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రతి గ్రామంలో గ్రౌండింగ్ చేసిన  పనులపై క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబంధిత పనుల నిర్వహణ ఫోటోలు అప్లోడ్ చేసి క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితిని నివేదించాలని  సంబంధిత అధికారులను ఆదేశించారు.   క్షేత్రస్థాయిలోజరిగే పనులపై సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించేలా  ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.    గ్రామ సచివాలయ భవనాల ఎంపిక ప్రక్రియలో, జడ్పీ సీఈఓ, ఎంపీడీవో, తహసీల్దార్లు, ఇంజనీర్లు, పంచాయతీ రాజ్, ఆర్డబ్ల్యూఎస్. ఇంజనీర్లు, ఆర్ డి వో లు, చురుకైన పాత్ర పోషించాలన్నారు.  వార్డు సచివాలయ భవనాలకు చెందిన స్థలాల ఎంపిక ప్రక్రియలో మున్సిపల్ శాఖ కమిషనర్లు, రైతు భరోసా కేంద్రాల స్థలాల భవనాల ఎంపిక ప్రక్రియలో వ్యవసాయ శాఖ అధికారులు, పంచాయతీ రాజ్,  ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లు, తహశిల్దార్లు చురుకైన పాత్ర పోషించాలన్నారు. వైయస్సార్ హెల్త్ క్లినిక్  కేంద్రాల  స్థలాల ఎంపిక ప్రక్రియలో  డీఎంహెచ్ఓ ఆధ్వర్యంలో, అంగన్వాడీ కేంద్రాల భవనం  పనులు స్థలాలకు సంబంధించిన పనులను ఐసిడిఎస్ పీడీ ఆధ్వర్యంలో నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.