నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవు..


Ens Balu
3
కలెక్టరేట్
2020-11-04 19:24:25

ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు స్థలాల ఎంపిక, పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహించే అధికారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని జె సి నిశాంత్ కుమార్ హెచ్చరించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ, భవన నిర్మాణాలకు కావలసిన  స్థలాల ఎంపిక పక్రియలో నిర్లక్ష్యం వహించే అధికారులు లక్ష్యాలు నిర్ధేశించుకొని విధులు నిర్వహించాలన్నారు. గ్రామ , మండల, డివిజన్, జిల్లా స్థాయి అధికారుల పర్యవేక్షణలో టీములు ఏర్పాటు చేయాలన్నారు. ఆ టీములు జరుగుతున్న పనులను పరిశీలించి,  శనివారం మధ్యాహ్నం లోపు నివేదికను  అందించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ప్రభుత్వం మార్చిలోపుగా అన్ని గ్రామసచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్ లుకు స్థలాలు ఎంపిక చేయాలన్నారు. ఈ కార్య మంలో జాయింట్ కలెక్టర్ గంగాధర్ గౌడ్, వ్యవసాయ శాఖ జెడి రామకృష్ణ,  పంచాయతీరాజ్ శాఖ సూపరింటెండింగ్  ఇంజనీర్ మహేశ్వరయ్య, Dmho కామేశ్వర ప్రసాద్, ఆర్డబ్ల్యూఎస్ సూపరింటెండింగ్  ఇంజనీర్  హరేరాం నాయక్. జడ్పీ సీఈవో శోభ స్వరూపరాణి. పంచాయతీరాజ్ శాఖ, ఆర్డబ్ల్యూఎస్, సంబంధిత శాఖ ఇంజనీర్లు, తదితరులు పాల్గొన్నారు.