స్టీల్ ప్లాంట్ లో అగ్నిప్రమాదం..నష్టం రూ.2కోట్లుపైనే


Ens Balu
3
Steel Plant
2020-11-05 12:00:47

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో గురువారం అగ్ని ప్రమాదం. ప్లాంట్ ప్రాససింగ్ యూనిట్ లో టర్బన్‌ ఆయిల్‌ లీక్‌ కావడంతో స్టీల్‌ప్లాంట్‌ టీపీపీ-2లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో  ప్లాంట్‌లోని 1.2 మెగావాట్ల విద్యుత్‌ మోటర్లు దగ్ధం కావడంతో సుమారు రూ.2కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. ప్లాంట్ లో జరిగిన అగ్ని ప్రమాదంపై యాజమాన్యం ఎలాంటి ప్రకటనా చేయలేదు. నిపుణుల కమిటీ వచ్చి జరిగిన నష్టాన్ని అంచనా వేసిన తరువాత యాజమాన్యం ప్రమాద వివరాలు తెలిపే అవకాశాలున్నాయి. స్టీల్ ప్లాంట్ లో ప్రమాదాలు జరగడం కొత్తేంకాదు. గతంలో కూడా చాలా ప్రమాదాలే జరిగాయి. అయితే అదే సమయంలో జరిగిన ప్రమాదాల నుంచి తక్కువ సమయంలో మళ్లీ కోవడంలోనూ వైజాగ్ స్టీల్ దిట్ట. గతంలో స్టీలు ప్లాంట్ లో ప్రమాదాలు జరిగిన సమయంలో సేఫ్టీ విషయంలో ఇండస్ట్రియల్ శాఖ సూచించిన మార్గదర్శకాలు సక్రమంగా పాటించనందునే మళ్లీ ఈ ప్రమాదం జరిగింది. దానికితోడు సేఫ్టీ విషయంలో ప్లాంటులో ఏ స్థాయిలో రక్షణ చర్యలు తీసుకున్నారో నేటికీ పరిశ్రమల శాఖ అధికారులకు కూడా స్టీలు ప్లాంటు యాజమాన్యం తెలియజేయలేదని సమాచారం..