6నుంచి వాసుపల్లి ప్రజాసంకల్పయాత్ర..


Ens Balu
2
ఆశీలుమెట్ట
2020-11-05 12:45:37

జననేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి పాదయాత్ర కు మూడేళ్లు గడిచిన సందర్భంగా ప్రజలలో నాడు..ప్రజల కోసం నేడు అనే నినాదంతో దక్షిణ నియోజకవర్గ పరిధిలోని అన్ని వార్డులలో ప్రజా సంకల్ప యాత్ర నిర్వహించనున్నట్టు ఎమ్మెల్యే వాసులపల్లి గణేష్ కుమార్ చెప్పారు. గురువారం ఆశీలుమెట్టలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. శుక్రవారం నుంచి  10రోజుల పాటు జరుగుబోయే కార్యక్రమంలో వైస్సార్సీపీ రాష్గ్ర బిసి కార్పొరేషన్ డైరెక్టర్స్, వార్డ్ ప్రెసిడెంట్స్, కార్పొరేటర్ అభ్యర్థులు, నాయకులతో ఈ యాత్ర సాగుతుందన్నారు. వార్డ్ పర్యటన ఈ క్రింది తేదీలలో ప్రతీ రోజు సాయంత్రం 4గంటల నుండి 8గంటల వరకు సాగుతుందని తెలియజేసిన వాసుల్లి పదిరోజుల షెడ్యులును విడుదల చేశారు. 06-11-2020 - 26/35వార్డ్ , 07-11-2020 - 25/39వార్డ్, 08-11-2020 - 20/29వార్డ్, 09-11-2020 - 21&22/30&27వార్డ్స్, 10-11-2020 - 23&24/36&38వార్డ్స్, 11-11-2020 - 27/31వార్డ్, 12-11-2020 - 30&28/32&33వార్డ్స్, 13-11-2020 - 31&15/42&27వార్డ్, 14-11-2020 దీపావళి సెలవు, 15-11-2020 - 29/34వార్డ్, 16-11-2020 - 44/41వార్డ్ లలో ఈ పర్యటన సాగుతుందని వివరించారు.