రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..


Ens Balu
3
Nagari
2020-11-05 16:12:27

రైతన్నల ప్రగతికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కృషి చేస్తున్నారని నగరి శాసనసభ్యురాలు  ఆర్.కే.రోజా అన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి అమలు చేయనన్ని సంక్షేమ పథకాలు ఒక్క వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సీఎం అమలు చేశారన్నారు. నగరి మండలం నగరి మార్కెట్ యార్డ్ లోనగరి, నిండ్ర విజయపురం మండలాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ కమిటీల ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ, రైతుల కోసమే ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రతీ గ్రామసచివాలయంలోనూ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు కావాల్సిన ఎరువులను మందులను, ఇతర సంక్షేమ పథకాలను అందిస్తోందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రెండువేల మంది ప్రజలు ఉన్న చోట ఒక అగ్రికల్చర్ సహాయకులను ఏర్పాటు చేసి రైతులకు పూర్తిస్థాయిలో సస్యరక్షణ చర్యలను తెలియజేస్తుందన్నారు. గతంలో మాదిరి రైతులు వ్యవసాయంలో ఏ విషయంలో నష్టపోకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. అనంతరం కొత్తగా ఏర్పాటైన మార్కెట్ కమిటీ చైర్మన్లను రోజా అభినందించారు. ఈ కార్యక్రమంలో నగిరి నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.