ప్రభుత్వ భవనాలు సత్వరం పూర్తిచేయాలి..


Ens Balu
2
Salur
2020-11-05 17:31:25

రాష్ట్ర ప్రభుత్వం మారుమూల నివసిస్తున్న వారికి మెరుగైన సేవలు అందించే నిమిత్తం గ్రామ సచివాయాలను ఏర్పాటు చేసి వినూత్న మైన మార్పులు తీసుకు వచ్చిందని ఐ.టి.డి.ఎ ప్రాజెక్ట్ అధికారి ఆర్.కూర్మనాథ్ పేర్కొన్నారు.   ప్రాజెక్ట్ అధికారి గురువారం  తన పర్యటనలో సాలూరు మండలం జిగిరాం, మామిడిపల్లి  గ్రామాలలో చేపడుతున్న  నాడు - నేడు పనులు,  గ్రామ  సచివాలయ, రైతు భరోసా కేంద్రాల భవన నిర్మాణ పనులు పరిశీలించారు.  అనంతరం  అధికారులతో మాట్లాడుతూ గ్రామ సచివాలయ, రైతు భరోసా కేంద్రాల భవన నిర్మాణ పనుల పై ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత నిస్తోందని అన్నారు, భవన నిర్మాణ పనులు వేగవంతం చేసి పూర్తి చేయాలన్నారు.  అనంతరం మామిడిపల్లి  గ్రామ సచివాలయంలో, రైతు భరోసా కేంద్రాలలో చేపడుతున్న పనులను పరిశీలించారు. సచివాలయంలో అందిస్తున్న సేవలపై ఆరా తీశారు, సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వ ఆదేశాలను, నియమాలను అందరూ తప్పకుండా ఆను సరించాలని, సేవల్లో పారదర్శకత పాటించాలని సిబ్బందికి సూచించారు. అందరూ విధిగా సమయానికి విధులకు హాజరు కావాలని సమయపాలన పాటించాలని అన్నారు.  పిర్యాదుల సేకరణలో పరిష్కారంలో ఆలసత్వం ప్రదర్శించ వద్దని సూచించారు. ఈ క్రమంలో సిబ్బంది హజరుపట్టి, ప్రగతి నివేదికల పట్టి పరిశీలించారు. వాలంటరీ వ్యవస్థను సక్రమంగా వినియోగించుకోవాలని హితవు పలికారు. అలాగే మామిడిపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ హైస్కూల్ సందర్శించారు.  ఈ సందర్భంగా ప్రాజెక్టు అధికారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ఆత్యదిక ప్రాధాన్యత కల్పిస్తుందని అన్నారు, నాడు నేడు పనులు వేగవంతం చేయాలన్నారు, పాఠశాలకు వచ్చిన సామాగ్రిని పరిశీలించారు, పాఠశాల తరగతులకు హాజరైన విద్యార్థులు, ఉపాధ్యాయులు సిబ్బంది కోవీడ్ నిబంధనలు తప్పక పాటించాలన్నారు, ప్రతీ ఒక్కరూ తప్పక మాస్క్ ధరించి, సామాజిక దూరం పాటించాలన్నారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులతో   మాట్లాడుతూ  తరుచూ చేతులు శుభ్రం చేసుకోవాలి, మాస్క్ ధరించి త దూరం పాటించాలన్నారు.   వ్యక్తిగత శుభ్రత పాటించడం వలన ఆరోగ్యవంతంగా ఉంటామని ఆరోగ్యంగా ఉన్న నాడు మంచి విద్యను పొందగలమని హితవు పలికారు.     ఈ పర్యటనలో  పంచాయతీ రాజ్  డిఇ కె.నాగేశ్వర రావు, ఇంజనీరింగ్ ఆసిస్టెంట్లు. పాఠశాల ప్రధనోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.