ప్రారంభమైన సర్టిఫికేట్ల పరిశీలన..


Ens Balu
3
Vizianagaram
2020-11-05 17:52:24

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో స‌చివాలయాల్లో వార్డు కార్య‌ద‌ర్శులు, గ్రామ కార్య‌ద‌ర్శుల ఫేజ్‌-2 ఉద్యోగాల భ‌ర్తీలో భాగంగా గురువారం జిల్లా ప‌రిష‌త్ కార్యాల‌యంలో ధృవ‌ప‌త్రాల ప‌రిశీల‌న ప్రారంభ‌మ‌య్యింది. వివిధ‌ విభాగాల‌కు సంబంధించిన అభ్య‌ర్థులకు ఆయా శాఖ‌ల అధికారులు దృవ‌ప‌త్రాల‌ను ప‌రిశీలించారు. తొలిరోజు ఏనిమ‌ల్ హ‌జ్బెండ‌రీ అసిస్టెంట్‌, విలేజ్ అగ్రిక‌ల్చ‌ర్ అసిస్టెంట్‌, ఫిష‌రీస్ అసిస్టెంట్‌, సెరీక‌ల్చ‌ర్ అసిస్టెంట్‌, వార్డు శానిటేష‌న్‌, ఎన్విరాన్‌మెంట‌ల్ అసిస్టెంట్, వార్డ్ వెల్ఫేర్‌, డెవ‌ల‌ప్‌మెంట్ సెక్ర‌ట‌రీ, వార్డ్ ప్లానింగ్‌, రెగ్యులేష‌న్ సెక్ర‌ట‌రీ, వార్డ్ ఎడ్యుకేష‌న్‌, డేటా ప్రాసెసింగ్ సెక్ర‌ట‌రీ మొద‌ల‌గు 473 ఉద్యోగాల నియామ‌కానికి సంబంధించి స‌ర్టిఫికేట్ల ప‌రిశీల‌న నిర్వ‌హించారు. జిల్లా ప‌రిష‌త్ ముఖ్య కార్య‌నిర్వ‌హ‌ణాధికారి టి.వెంక‌టేశ్వ‌ర్రావు ఆధ్వ‌ర్యంలో, వివిధ ప్ర‌భుత్వ‌శాఖ‌ల‌కు సంబంధించిన సిబ్బంది అభ్య‌ర్థుల స‌ర్టిఫికేట్ల‌ను ప‌రిశీలించారు.