ధాన్యం సేకరణకు మిల్లర్లను సిద్ధం చేయాలి..


Ens Balu
3
కలెక్టరేట్
2020-11-05 17:59:41

విజయనగరం జిల్లాలో ఈనెల 20 కల్లా వరిపంట రైతుల చేతికి వస్తుందని భావిస్తున్నామని అప్పటికీ మిల్లర్లు ధాన్యం సేకరణ కోసం సిద్ధంగా ఉండాలని సంయుక్త కలక్టరు డా. జి.సి. కిషోర్ కుమార్  అన్నారు.   ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఖరీఫ్ నకు 5 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు.  మిల్లర్లంతా బ్యాంక్ గ్యారంటీలను ఈనెల 15 లోగా సమర్పించాలని, వారికి దగ్గరగా ఉన్న ధాన్యం సేకరణ కేంద్రాలకు వారిని ట్యాగ్ చేయడం జరుగు తుందని తెలిపారు.  గురువారం ఆయన చాంబరులో రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు.  గత ఏడాది సేకరణలో  గన్ని సంచుల వివరాలను 26 మంది మిల్లర్లు  ఇంకనూ రీకన్స్ లేషన్ చేయలేదని, వెంటనే రికన్సలేషన్ చెయ్యాలన్నారు.  పౌర సరఫరాల సంస్ద ప్రస్తుతం గన్ని బ్యాగ్లు సరఫరా చేసే పరిస్ధితి లేదని, పాత బేగ్ లనే వినియోగించాలని తెలిపారు.  గత ఏడాది మిగిలిపోయిన గన్ని బేగ్లను వెంటనే గొట్లాం, సుంకి గోడౌన్లకు అప్పగించాలన్నారు.  బిల్లుల చెల్లింపుల కోసం వెంటనే క్లైయిమ్ లు పెట్టాలని, బిల్లుల చెల్లింపు విషయంలో పారదర్శకంగా ఉండాలన్నారు.  ధాన్యంను నిల్వవుంచేందుకు సరిపడేలా రైస్ మిల్లుల సమీపంలో గోడౌన్ల సంఖ్యను పెంచాలని పౌర సరఫరాల సంస్ద జిల్లా మేనేజర్ వరకుమార్ కు ఆదేశించారు.   ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి ఎ. పాపారావు, వ్యవసాయ శాఖ ఉప సంచాలకులు నంద్, రైస్ మిల్లర్ల అసోషియేషన్ ప్రతినిధులు కొండపల్లి కొండలరావు, గుణాన శ్రీరామమూర్తి,  కె. సాయి శ్రీనివాస్, జి. నరేష్ తదితరులు పాల్గొన్నారు.