కార్పోరేట్ ఆసుపత్రిలకు ధీటుగా కెజిహెచ్..


Ens Balu
2
కెజిహెచ్
2020-11-05 18:15:55

విశాఖలో కార్పొరేట్ హాస్పటళ్లకు ధీటుగా కె జీ హెచ్  ను తీర్చిదిద్దుతామని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. డాక్టర్ల వినతిమేరకు పార్లమెంట్  నియోజక వర్గ అభివృద్ధి నిధులు రూ.23.56 లక్షల విలువైన 25 సీటర్  బస్సును కెజిహెచ్ కి అందించారు. గురువారం ఆసుపత్రిలో బస్సు ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. త్వరలో ప్రత్యేక కాన్సర్ విభాగం ఏర్పాటుకు కసరత్తు చేస్తామనిచెప్పారు .ఈ విషయంపై వైద్య విభాగ ఉన్నతాధికారులతో ఇప్పటికే మాట్లాడామన్ని ఎంపీ వివరించారు. పరిపాలనా  రాజధానిగా  అవతరించిన విశాఖ లో వనరుల కొరత లేదన్నారు. విద్య, వైద్యం నిరుపేదలకు మరింత చేరువ చేస్తామని అన్నారు. విశాఖ  వై ఎస్ జగన్మోహనరెడ్డి నాయకత్వంలో ప్రపంచ గుర్తింపు స్థాయిగా నగరంగా వెలుగొందడం తధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో  దక్షిణనియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి  గణేష్  కుమార్ మాట్లాడుతూ, కెజిహెచ్ ను అభివ్రుద్ధి చేయడం ద్వారా సుమారు ఐదు జిల్లాల ప్రజలకే కాకుండా పక్కరాష్ట్రాలకు ప్రజలకు కూడా వైద్యసేవలు అందుతాయన్నారు. ఇక్కడ అన్ని రకాల వైద్యసేవలు అందించడానికి సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారు. ఇటీవలే కొరగా వున్న స్టాఫ్ నర్సు పోస్టులను భర్తీజరిగిందన్నారు. ఈకార్యక్రమంలో కె జీ హెచ్  సూపరింటెండెంట్ మైథిలి,పెద్దసంఖ్యలో డాక్టర్లు పాల్గొన్నారు.