కో-ఆప్టెక్స్ లో దీపావళి ప్రత్యేక తగ్గంపు ధరలు..


Ens Balu
1
సూర్యాబాగ్
2020-11-05 18:51:23

 దీపావళి పండుగ సంధర్బంగా  తమిళనాడు  ప్రభుత్వం చేనేత సహకార సంస్థ కో –ఆప్టెక్స్ వస్త్రాల పై ప్రత్యేక తగ్గింపు పధకాన్ని  ప్రజలు వినియోగించుకోవాలని సమాచార, పౌర సంబంధాల శాఖ,  ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, వి.మణిరామ్ కోరారు.   గురువారం సూర్యబాగ్ షోరూంలో నిర్వహించిన ప్రత్యేక ఆఫర్ పథకాన్ని ఆయన ముఖ్యఅతిధిగా హాజరై జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సంధర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ,  దీపావళి పండుగను పురస్కరించుకొని కో – ఆప్టెక్స్  ప్రత్యేక తగ్గింపు  పథకాన్ని అందజేస్తున్నారని చెప్పారు.  దీనిలో భాగంగా  అన్ని చేనేత వస్త్రాలపై  30 శాతం వరకు తగ్గింపు  ఇస్తున్నారని,  నాణ్యతగల  చేనేత వస్త్రాలను  ధరించడం  వలన హోదాతో  పాటు  ఆరోగ్యానికి  మేలు జరుగుతుందన్నారు. ఈ షోరూం లో కాటన్, సిల్క్, కంచి,  అరణి, కోయంబత్తూర్ వస్త్రాలతో  పాటు  అన్నిరకముల  దుప్పట్లు, దివాన్ సెట్లు, లుంగీలు, ఆర్గానిక్ పట్టు చీరలు, ఆర్గానిక్ కాటన్ చీరలు,  ఆర్గానిక్ టవల్స్, చుడిదార్ డ్రస్ మెటీరియల్  మరియు రెడీమేడ్ షర్ట్స్ లభ్యం  అవుతాయని  చెప్పారు. ఈ ప్రత్యేక రాయితీ ధరతో  అన్నిరకాల  డిజైన్ లలో  చీరలు, డ్రస్ మెటీరియల్స్  అందుబాటు ధరలో  అందజేస్తున్నట్లు తెలిపారు.   విజయవాడ రీజనల్ మేనేజరు  టి.రాధాకృష్ణన్ మాట్లాడుతూ,  చేనేత కళాకారులకు వినియోగదారులకు మధ్య అవగాహన పెంపొందించేందుకు ప్రతి చేనేత వస్త్రాలపై  చేనేత  కళాకారుని  ఫోటోను  ముద్రించడం  జరుగుతుందన్నారు. అన్ని చేనేత  వస్త్రాలు ఈ తగ్గింపు పధకంపై వినియోగదారులకు అందించనున్నట్లు ఆయన వివరించారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.