ప్రభుత్వ కార్యాలయాలు పరిశీలించిన కలెక్టర్..
Ens Balu
4
Hindupuram
2020-11-05 18:58:17
అనంతపురం జిల్లాలో హిందూపురంలో ఉన్న వివిధ ప్రభుత్వ కార్యాలయాలను గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. హిందూపురం లోని మున్సిపల్ కార్యాలయాన్ని, మున్సిపల్ కార్యాలయంలోని సచివాలయాన్ని, పాలశీతలీకరణ కేంద్రాన్ని, డ్వామ ఏపీడి కార్యాలయాన్ని, ఆర్టిఓ కార్యాలయాన్ని, పట్టు పరిశ్రమ శాఖ సహాయ సంచాలకులు వారి కార్యాలయంను, ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ను జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు రైతు భరోసా) నిశాంత్ కుమార్, పెనుకొండ సబ్ కలెక్టర్ నిషా0తితో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా కార్యాలయాల్లో భవనాలను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంతకుముందు జరిగిన జిల్లా సమీక్షా కమిటీ సమావేశంలో హిందూపురం లో వివిధ ప్రభుత్వ శాఖల భవనాలు పాతబడ్డాయని ప్రజాప్రతినిధులు తెలిపిన నేపథ్యంలో ఆయా ప్రభుత్వ శాఖల భవనాల పరిస్థితి ఎలా ఉందో జిల్లా కలెక్టర్ పరిశీలన చేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శ్రీనివాసులు, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.