సచివాలయాల్లో సత్వర సేవలందించాలి..
Ens Balu
7
Bheemalay
2020-11-05 19:00:51
గ‌్రామ సచివాలయాల ద్వారా మెరుగైన, సత్వర సేవలందించడం ద్వారా గ్రామాల్లోనే తమకు ప్రభుత్వ సేవలు అందుతాయనే విశ్వాసాన్ని ప్రజల్లో కల్పించాలని జాయింట్ కలెక్టర్(ఆసరా) జె.వెంకటరావు సచివాలయ సిబ్బందికి సూచించారు. ఎల్.కోట మండలం బీమాలి సచివాలయాన్ని ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ సచివాలయం ద్వారా అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. ప్రభుత్వ పథకాల సమాచారాన్ని సచివాలయంలో గోడలపై ప్రదర్శించినదీ లేనిదీ పరిశీలించారు. సంక్షేమ పథకాల కోసం అందే వినతుల పరిష్కారంపై చేపట్టిన చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఇ-రిక్వెస్టుల పరిష్కారంపై ఆరా తీశారు. సచివాలయ ఉద్యోగుల హాజరు పట్టీలను పరిశీలించి సిబ్బంది అంతా ప్రతిరోజు విధులకు హాజరవుతున్నదీ లేనిదీ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సచివాలయాలకు మంచి పేరు తీసుకురావడమనేది సిబ్బంది చేతుల్లోనే ఉందని, సిబ్బంది ప్రజలకు చేరువగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిత్యం కృషిచేయాలని సూచించారు.