ప్రభుత్వ భవనాల వివరాలు అప్లోడ్ చేయాలి..


Ens Balu
3
కలెక్టరేట్
2020-11-05 19:37:09

శ్రీకాకుళం జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలు నిర్వహించే భవనాల వివరాలను ఖచ్చతంగా అప్ లోడ్ చేయాలని సంయుక్త కలెక్టర్ సుమీత్ కుమార్ తెలిపారు.  గురువారం జిల్లా కలెక్టర్ వారి సమావేశ మందిరంలో  జిల్లాల పునర్విభజనపై అధికారులకు  అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు.   జిల్లా స్థాయి,, డివిజన్, మండల స్థాయిలలో కార్యాలయాలు నిర్వహిస్తున్న స్వంత భవనాల వివరాలను, అద్దె భవనాల వివరాలను,  వేకెంట్ ల్యాండ్ కలిగి వున్న  స్వంతభవనాల వివరాలను అప్ లోడ్ చేయాలని తెలిపారు. మోడ్యూల్ సాఫ్ట్ వేర్ రూపొందించడం జరిగిందని, ఇందులో ప్రతీ అంశాన్నీ క్షుణ్ణంగా అప్ లోడ్ చేయాలన్నారు. ప్రభుత్వ శాఖ వేకెంట్ ల్యాండ్ యొక్క సర్వే నెంబరును అప్ లోడ్ చేసిన అనంతరం సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారి వేకెంట్ స్థలాన్ని పరిశీలించి ధృవీకరించాలన్నారు.  ప్రభుత్వ శాఖలకు యూజర్ ఐడి, పాస్ వర్డ్ లను ఇవ్వడం జరిగిందని  ఇ.డి.ఎం. ఇంద్రశేఖర్ ను ఫోను నెం.833989277 ను సంప్రదించి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చునని  తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి బి.దయానిధి, నగరపాలక సంస్ధ కమీషనరు పి.నల్లనయ్య, జిల్లా పంచాయితీ అధికారి రవికుమార్, జిల్లా విద్యాశాఖాధికారి కె.చంద్రకళ, జిల్లా ఖజానాధికారి నిర్మలమ్మ , ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.