వైఎస్ జగన్ సోషలిస్టు..చంద్రబాబు క్యాపిటలిస్టు..


Ens Balu
1
ద్వారకానగర్
2020-11-06 10:21:05

పేదల కష్టాలు, ఆకలిని తెలుసుకొని వారికి ఏం కావాలి అనేది ఆలోచించి ఆ విధంగా పాలన సాగిస్తున్న వైయస్ జగన్ సోషలిస్టు అని, అదే  చంద్రబాబు నాయుడు అయితే పెట్టుబడి పెట్టి ఎవరు ఏమైపోయినా తనకు లాభాలు ఏ విధంగా రావాలో అని ఆలోచించే వ్యక్తి క్యాపిటలిస్టు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ అడ్వకేట్స్ ఐక్యవేదిక సమన్వయకర్త పాక సత్యనారాయణ పేర్కొన్నారు. హోటల్ మేఘాలయ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ. వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టి అన్ని వర్గాలకు సంక్షేమ కార్యక్రమాలను అందిస్తూ చక్కటి సోషలిస్టుగా పేరును పొందారన్నారు.  ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా ప్రజల కష్టనష్టాలను పక్కన పెట్టి  కేవలం లాభార్జన ధ్యేయం గా పని చేసినందున ఆయన కాపిటలిస్ట్  వర్గానికి చెందుతారని  ఆయన తెలిపారు. వైయస్ జగన్ తన మంత్రివర్గంలో 60 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు క్యాబినెట్ మంత్రిలుగా నియమించారన్నారు. అదే చంద్రబాబు ఎంత మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ లను తన మంత్రివర్గంలో చోటిచ్చారో  చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో లో అసోషియేషన్ ప్రతినిధులు, అడ్వకేట్లు తదితరులు పాల్గొన్నారు.