9న అరసవల్లి హుండీల లెక్కింపు..


Ens Balu
2
అరసవల్లి
2020-11-07 08:14:33

శ్రీకాకుళం జిల్లాలోని అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం హుండీలను ఈ నెల 9వ తేదీన తెరుస్తామని సహాయ కమీషనరు, ఆలయ ఈఓ వి.హరిసూర్య ప్రకాష్ శుక్రవారం  తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో మీడియాతో మాట్లాడుతూ,  9వ తేదీ సోమవారం నాడు ఉదయం 9 గం.లకు 40 మంది సిబ్బందితో డిపార్ట్ మెంట్ వారి సమక్షంలో అనువంశిక ధర్మకర్త మరియు పాలక మండలి సభ్యుల సమక్షంలో అర్చకులు, భక్తులు, గ్రామ పెద్దల సమక్షంలో హుండీలను తెరవడం జరుగుతుందన్నారు. కోవిడ్ నేపథ్యంలో ప్రభుత్వం నిర్ధేశించిన నియమ నిబంధనల మేరకు ఏర్పాట్లు చేసినట్టు ఈఓ వివరించారు. సామాజిక దూరం, సిబ్బందికి తప్పనిసరిగా మాస్కులు, హేండ్ గ్లౌజులు ఇలా అన్నిరకాల ఏర్పాట్ల మధ్య స్వామివారి హుండీ లెక్కింపు జరుగుతుందన్నారు. లెక్కింపునకు సంబంధించిన సిబ్బందిని ఎంపిక చేయడంతోపాటు, వారికి లెక్కింపు సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ముందుగా తెలియజేసినట్టు ఈఓ వివరించారు.