హమ్మయ్య పెన్షను పడింది..


Ens Balu
3
విశాఖజిల్లా
2020-11-07 08:23:58

ఆంధ్రప్రదేశ్ లో నవంబరు నెల పెన్షలు 7వ తేది వస్తే కానీ మోక్షం కలగలేదు.. గత ఐదు రోజులుగా పెన్షన్లు రాకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా పెన్షను దార్లు ఖజానాశాఖ అధికారులకు పదే పదే ఫోన్లు చేయడంతో ఎట్టకేలకు ఆవరతేదిన పెన్షను మొత్తాన్ని పెన్షను దారుల ఖాతాలోకి మళ్లిస్తున్నట్టు ఖజానాశాఖ అధికారులు తెలియజేశారు. ప్రతీనెలా టంచనుగా 1వ తేదీనే పడిపోయే పెన్షన్లు ఈనెల 6వ తేదీ వచ్చినా నేటికీ పించన్లు పడలేదు. దీనితో పెన్షను దారులు ఖజానాశాఖకు ఫోన్లు మీద ఫోన్లు చేస్తున్నారు. అందులోనూ చాలా మందికి ఆ పెన్షన్లమీదే ఆధారపడి జీవిస్తుండటంతో ఆ పరిస్థితి మరింత జటిలంగా మారింది. అయితే పెన్షను దారులకు ఎందుకు పించన్లు ఆలస్యమయ్యాయనే విషయంలో ఖజానా శాఖ అధికారులు క్లారిటీ ఇచ్చారు. సాంకేతిక పరమైన ఇబ్బంది రావడంతోనే పెన్షన్లు ఆలస్యం అయ్యాయని విశాఖలోని ఖజానాశాఖ డిప్యూటీ డైరెక్టర్ శివప్రసాద్ మీడియాకి వివరించారు. ఉదయం పదిగంటల నుంచి పెన్షనుదారుల ఖాతాలకు నగదు జమ అవుతున్నట్టు ఆయన వివరించారు.  ఎపుడైనా జీతాలుగానీ, పెన్షన్లుగానీ ఆలస్యమైతే ప్రభుత్వం ముందుగా సమాచారం అందించేది. ఈ నెల పెన్షను దారులకు సమాచారం ఇవ్వకపోవడంతోపాటు ఒక్కసారిగా పెన్షనుదారుల్లో గందరగోళం నెలకొంది..