లోక్ అదాలత్ తో సత్వర న్యాయం..


Ens Balu
3
Srikakulam
2020-11-07 14:41:13

లోక్ అదాలత్ ద్వారా ఉచిత, సత్వర న్యాయం  సాధ్యమౌతుందని జిల్లా జడ్జి మరియు జిల్లా న్యాయ సేవాధికార  సంస్థ అధ్యక్షులు జి.రామకృష్ణ తెలిపారు. శనివారం, జిల్లా కోర్టు ఆవరణలో మెగా వర్చువల్ లోక్ అదాలత్ కార్యక్రమం సందర్భంగా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చట్టానికి  ఖచ్చితత్వం, నిష్పక్షపాతం  వుంటాయన్నారు. నిరుపేదలకు ఉచిత న్యాయ  సహాయం , కక్షిదారులకు సత్వర న్యాయాన్ని అందించడానికి లోక్ అదాలత్  ఏర్పడిందన్నారు.  కాలం చాలా విలువైనదని, కక్షిదారులు ఇరువురికీ విజయం లోక్ అదాలత్ ద్వారా లభిస్తుందన్నారు.   జిల్లా కోర్టు ఆవరణలో 4 బెంచ్ లను ఏర్పాటు చేశామన్నారు.  1వ బెంచ్ : టి.వెంకటేశ్వర్లు, (సెకెండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్సు జడ్జి ఫర్ టారిఫ్ ఆఫ్ అఫెన్సు ఎగైనస్ట్ వుమెన్ ) మెంబర్లు జి.రాధారాణి, అడ్వోకేట్ మెంబర్లుగా, వై.ప్రసాద రావు సోషల్ వర్కర్ 2వ బెంచ్:  కె.జయలక్ష్మి, సీనియర్ సివిల్ జడ్జి-కం-సెక్రటరీ, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారటీ, అడ్వోకేట్ మెంబర్లుగా  వి.హరిప్రియ, వి.జగన్నాధ రావు, 3వ బెంచ్: జి.కిశోర్ కుమార్, స్పెషల్ జుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ క్లాస్ 1, (పి అండ్ ఇ) కోర్టు అడ్వోకోట్ మెంబర్లుగా  బి.అప్పలనాయుడు, డి.ఈశ్వర రావు, 4వ బెంచ్: జి.లెనిన్ బాబు, జుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ క్లాస్ 1 స్పెషల్ మొబైల్ కోర్టు, అడ్వోకేట్ మెంబర్లు గా ఎస్. విజయ లక్ష్మి, కె.అప్పారావు లను  నియమించడం జరిగిందన్నారు.  ఈ సందర్భంగా దూర ప్రాంతాల నుండి వచ్చిన కక్షిదారులకు అడ్వోకేట్ మామిడి శ్రీకాంత్ పులిహార పొట్లాలను అందించారన్నారు.  ఈ సమావేశానికి జడ్జీలు టి.వెంకటేశ్వరరావు, అన్నపూర్ణమ్మ, శిష్టు రమేష్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.జయలక్ష్మి, జిల్లా రెవిన్యూ అధికారి బి.దయానిధి, అడిషనల్ ఎస్.పి. టి.విఠలేశ్వర రావు, కక్షిదారులు హాజరైనారు.