విశాఖ దక్షిణంలో అభివ్రుద్ధి పనులు చేపట్టండి..


Ens Balu
2
విశాఖ దక్షిణ నియోజకవర్గం
2020-11-07 15:51:48

విశాఖ మహానగరంలోని దక్షిణ నియోజకవర్గంలోని పాతపోస్టాఫీసు దగ్గర అభివ్రుద్ధి పనులు చేపట్టాలని ఎమ్మెల్యేవాసుపల్లి గణేష్ కుమార్ జివిఎంసి కమిషనర్ డా.జి.స్రిజనకు శనివారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసుపల్లి మీడియాతో మాట్లాడుతూ, 25/39వార్డ్ లో పాత పోస్ట్ ఆఫీస్ దగ్గర డీన్ షాదీఖానా రెనోవేషన్, ఫెర్రీ రోడ్ లో ఉన్న  బాబూలాల్ జిమ్ రిపేర్లు & 24/38వార్డ్ లో పెద్ద కాలువ దగ్గర ఉన్న ఖాళీ గా ఉన్న స్థలంలో యాసిన్ బాబా దర్గాహ్  ముస్లిం కొరకు కమ్యూనిటీ హాల్ & జిమ్ , మత్స్యకారుల కొరకు కమ్యూనిటీ హాల్ పనులు మంజూరు చేయాలని కమిషనర్ ను కోరినట్టు చెప్పారు. ఈ ప్రాంతాల్లో అభివ్రుద్ధి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఈ ప్రాంతీయుల సమస్యలు తీరుతాయని అన్నారు. అంతేకాకుండా తన ఎమ్మెల్యే గ్రాంటు నుంచి కూడా కొంత మొత్తాన్ని ఈ ప్రాంత అభివ్రుద్ధికి వెచ్చించనున్నట్టు ఆయన తెలియజేశారు. రాష్ట్రంలో అన్నిప్రాంతాల్లో అభివ్రుద్ధి కార్యక్రమాలు చేపడుతున్న తరుణంలో విశాఖలోని దక్షిణ నియోజకవర్గంలో కూడా ప్రతిపాదిత పనులపై జివిఎంసి ద్రుష్టిసారించాలని కోరినట్టు చెప్పారు..