పరవాడ ఫార్మాసిటీ బాధితులకు చెక్కుల అందజేత..
Ens Balu
4
Paravada
2020-07-25 20:55:16
పరవాడ ఫార్మా సిటీ లోని సాయినార్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ లో జూన్ 29 వ తేదీన జరిగిన హైడ్రోజన్ సల్ఫైట్ గ్యాస్ లీకేజీ ఘటన లో మరణించిన మహంతి గౌరీ శంకర్ కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన ఎక్స్ గ్రేషియా రూ.15.00 లక్షల మొత్తానికి చెక్కు ను ఆయన భార్య కోట్ల వెంకట లక్ష్మి కి శనివారం నాడు తన నివాసంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అందజేశారు. అలాగే సాయినార్ కంపెనీ తరపున ఇస్తున్న ఎక్స్ గ్రేషియా రూ. 35.00 లక్షల మొత్తానికి సంబంధించి ఆయన భార్య కోట్ల వెంకట లక్ష్మి కి రూ. 10.00 లక్షల చెక్ ను, తండ్రి మహంతి లక్ష్ము నాయుడు కు రూ. 12.50 లక్షల చెక్ ను, తల్లి మహంతి అప్పల నరసింహ కు రూ. 12.50 చెక్ లను కూడా మంత్రి చేతుల మీదుగా అందజేశారు.