నిజమైన గ్రామస్వరాజ్యం జగనన్నతోనే సాధ్యం..


Ens Balu
2
దక్షిణ నియోజకవర్గం
2020-11-07 17:14:02

డా..బి ఆర్.అంబేద్కర్ ఆశయాలను, గాంధీజీ కలలుగన్న స్వరాజ్యం కోసం పాటుపడుతున్న ఏకైక జననేత సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని విశాఖ దక్షణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. సీఎం చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు 3ఏళ్ళు గడిచిన శుభ సందర్భంగా  ప్రజలలో నాడు...ప్రజల కోసం నేడు"అనే నినాదంతో దక్షిణ నియోజకవర్గ పరిధిలో  25వార్డు/39వవార్డులో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, దేశంలో ఏ ముఖ్యమంత్రీ చేపట్టని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారన్నారు. ప్రజల కష్టాలు తెలుసుకొని వారికోసమే పరితపిస్తున్నారని కొనియాడారు. అంతకుముందు  పాత పోస్ట్ ఆఫీస్ వద్ద దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ జంక్షన్ లో  తూర్పు ముఖంగా కోటవీధి కదిరి దానప్ప వీధి-- ముఖ ద్వారం తదితర ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించారు. అడుగడుగునా మహిళలు హారతులు పడుతూ ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. ఈ పాదయాత్ర లో వైస్సార్సీపీ  రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్, రాష్ట్ర బీసీ డైరెక్టర్స్ సబిరా బేగం,  సిటీ మహిళా ప్రెసిడెంట్ గరికిన గౌరి, సౌత్ మహిళా ప్రెసిడెంట్ నీలాపు లక్ష్మీ, 39 వార్డ్ ప్రెసిడెంట్ సూరాడ తాతారావు, కార్పొరేటర్ అభ్యర్థి కొల్లి సింహాచలం, ముస్లిం మైనారిటీల నాయకులు సాధిక్, సౌత్ ముస్లిం నాయకులు ముజేబుఖాన్, యాసిన్, బాబ్జి, మసేను, వైస్సార్సీపీ సీనియర్ నాయకులు, రాష్ట్ర కమిటీ,  సిటీ కమిటీ, వార్డ్ ప్రెసిడెంట్స్, వార్డ్ కార్పొరేటర్ అభ్యర్థులు, వార్డ్ కమిటీ, వార్డు అనుబంధ సంఘ ప్రెసిడెంట్ లు, కార్యకర్తలు పాల్గొన్నారు.