స్పందన ఇ-ఆఫీసు ద్వారా చేపట్టండి..


Ens Balu
2
జివిఎంసీ కార్యాలయం
2020-11-09 16:29:17

స్పందన దరఖాస్తులపై ఆయాశాఖల అధికారులు తక్షణమే స్పందించాలని జివిఎంసి కమిషనర్ డాక్టరు జి. సృజన అధికారులను ఆదేశించారు. సోమవాంర కమిషనర్  తన చాంబర్లో కార్పోరేషన్ ఉన్నతాధికార్లతో అర్జీ దారులు స్పందనలో సమర్పించిన ఆర్జీల పరిష్కార వివరాలను అడిగి  తెలుసుకున్నారు.  ప్రధాన కార్యాలయ స్థాయి, జోనల్ స్థాయిలో గల పెండింగ్ ఫైల్స్ పరిష్కారానికి తగు శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. అన్ని ఫైల్స్ లను ఇ-ఆఫీసు విధానం ద్వారా తనకు ఆమోదం నిమిత్తం సమర్పించాలని ఆదేశించారు. అ విధంగా సిబ్బంది చేస్తున్నారో లేదో ఐ.టి. విభాగం వారు ఒక యాప్ ద్వారా పరిశీలించాలని ఆదేశించారు. ఇప్పటి వరకు ప్రతీ విభాగంలోనూ పెండింగ్ లో ఉన్న కరెంట్ ఫైల్స్ వివరాలను గురువారం నాటికి సమర్పించాలని అదనపు కమిషనర్లకు సూచించారు. వార్డు సచివాలయాల నుండి ప్రధాన ఆఫీసరు వరకు కూడ ప్రజా విన్నపములు పౌర నియమావళి అనుగుణంగా నిర్ణీత సమయాలలోనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. న్యాయస్థానంలో గల వ్యాజ్యాములపై పూర్తిస్తాయి వివరాలు తనకు సమపర్పించాలని ఆదేశించారు. వార్డు సచివాలయం లను తనిఖీ చేయని ప్రత్యేక అధికారులకు షోకాజ్ నోటీసులు అందించాలని ఆదేశించారు. ఇప్పటి వరకు గుర్తించిన 165 నీటి వనరులలో కలుపు మొక్కలను, మట్టిని తీయడానికి కావాల్సిన అంచనాలను తయారు చేయాలని ప్రధాన ఇంజినీరును ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్లు ఆషాజ్యోతి, రమణి, సన్యాసి రావు, ప్రధాన ఇంజినీరు ఎం. వెంకటేశ్వరరావు, డి.సి.(ఆర్) ఎ. రమేష్ కుమార్, పి.డి.(యు.సి.డి) వై. శ్రీనివాసరావు, ఎగ్జామినర్ ఆఫ్ అక్కౌంట్స్ వై. మంగపతిరావు, సి.ఎం.ఓ.హెచ్ డా. కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, జె.డి.(అమృత్) విజయ భారతి, ఎఫ్.ఎ & ఏ.ఒ. మల్లికాంబ, ఏ.డి.హెచ్ దామోదర రావు, డి.ఇ.ఓ.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.