లబ్ధిదారుల ఖాతాల్లోకి వై.యస్.ఆర్.కాపునేస్తం..


Ens Balu
2
Srikakulam
2020-11-09 18:30:59

శ్రీకాకుళం జిల్లాలో వై.యస్.ఆర్.కాపునేస్తం క్రింద మహిళా లబ్ధిదారుల ఖాతాల్లో రూ.15,000/-లు జమచేసినట్లు బి.సి.కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు జి.రాజారావు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.. జిల్లాలోని 45 సం.ల నుండి 60సం.ల మధ్య వయస్సు గల కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల్లోని  మహిళలందరూ వై.యస్.ఆర్.కాపునేస్తం పథకానికి అర్హులేనని అన్నారు. వై.యస్.ఆర్. కాపు నేస్తం క్రింద తొలి విడతగా జూన్ 24న జిల్లాలోని 4,239 మంది మహిళా లబ్ధిదారుల ఖాతాల్లో 6.36 కోట్లు జమచేసిన సంగతి అందిరికీ విదితమే. నవంబర్ 7వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా వై.యస్.ఆర్. కాపునేస్తం రెండవ విడత  క్రింద ఒక్కో మహిళకు రూ.15,000/-లు వంతున జిల్లాలోని 1,547 మంది మహిళలకు 2.32 కోట్ల రూపాయలు జమచేయడం జరిగిందని ఆయన వివరించారు.