విశాఖలో రేపు డిడిఆర్సీ ...


Ens Balu
2
ఆంధ్రాయూనివర్శిటీ
2020-11-09 18:40:07

విశాఖ జిల్లాలో ఈ నెల 10వ తేదీన జరుగనున్న జిల్లా అభివృద్ధి కమిటీ సమీక్షా సమావేశం ఏర్పాట్లను జిల్లా రెవెన్యూ అధికారి ఎ. ప్రసాద్ పరిశీలించారు.   జిల్లా అభివృద్ధి కమిటీ సమీక్షా సమావేశం ఏర్పాట్లను బీచ్ రోడ్డులో ని ఆంధ్రా యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్ ను సోమవారం ఆయన పరిశీలించారు.  వేదికపై ఏర్పాట్లు, ముఖ్య అతిథులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గోనున్నందున  ఏర్పాట్లను ఆయన పరిశీలించి ప్రజా ప్రతినిధులు, అధికారులకు సీట్లు కేటాయింపుకు సంబంధించి చూసుకోవాలని పట్టణ తహసీల్దార్ ఎ. జ్ఞనవేణి ని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కార్యాలయం పరిపాలన అధికారి రామ్మోహన్ రావు, పట్టణ తహసీల్దార్ ఎ. జ్ఞనవేణి, ఆర్.ఐ.లు రవికృష్ణ, చైతన్య, తదితరులు  పాల్గొన్నారు.