ఎన్.ఎం.ఎం.ఎస్ హాల్ టికెట్ సవరణ..
Ens Balu
1
శ్రీకాకుళం
2020-11-10 15:34:41
జాతీయ ప్రతిభా పరీక్ష - 2019 ( ఎన్.ఎం.ఎం.ఎస్ )కు ఎంపికకాబడిన విద్యార్ధుల హాల్ టికెట్స్ నందు తప్పులు ఉంటే సవరించడం జరుగుతుందని జిల్లా విద్యాశాఖాధికారి కె.చంద్రకళ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసారు. 2019 జాతీయ ప్రతిభా పరీక్షకు హాజరై ఎంపిక కాబడిన విద్యార్ధుల హాల్ టికెట్లలో ఆధార్, విద్యార్ధి పేరు, పుట్టిన తేది, బ్యాంకు అకౌంట్ వివరాలు జతకానట్లయితే వాటిని జిల్లాలోని ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపధ్యాయులు సవరించాలని ఆదేశించారు. విద్యార్ధుల హాల్ టికెట్ తో మ్యాచింగ్ కాని వివరాలను నిర్ణీత ప్రొఫార్మాలో నమోదు చేసి జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయానికి తక్షణమే సమర్పించాలని ఆమె కోరారు. ఈ విషయమై ఎటువంటి సందేహాలు ఉన్న ఎడల జూనియర్ సహాయకులు 84639 03273 సెల్ నెంబరుకు సంప్రదించి అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చని ఆమె ఆ ప్రకటనలో వివరించారు.