చెత్తసేకరణ నూరుశాతం చేపట్టాల్సిందే..


Ens Balu
2
ఇండోర్ స్డేడియం
2020-11-10 18:13:06

జివిఎంసీలో అధికారుల నుంచి వార్డు సచివాలయ సిబ్బంది వరకూ ప్రజారోగ్యం, సేవలకే  అధిక సమయం కేటాయించాలని కమిషనర్ డా.స్రిజన సూచించారు. మంగళవారం స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంలో కార్పోరేషన్ ప్రజారోగ్య విభాగంలో పనిచేస్తున్న వార్డు శానిటరీ కార్యదర్శులు, శానిటరీ ఇన్ స్పెక్టర్లు, శానిటరీ సూపర్వైజర్లు, అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్లు, మలేరియా విభాగపు సిబ్బందితో సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, కార్పోరేషన్ పరిధిలో, ఇంటి నుండి చెత్తను తీసుకొని వెళ్ళే పద్దతిని ఓ.డబ్ల్యూ.ఎం.ఎస్. విధానం ద్వారా మదించగా కార్పోరేషన్ పరిధిలో 84% వరకు సఫలీకృతం అయ్యామన్నారు. అదే సమయంలో కొన్ని వార్డులలో సిబ్బంది నూటికి నూరు శాతం చెత్తను సేకరిస్తుండగా, మరికొందరు తక్కువ శాతం చూపించడం వలన ప్రస్తుతం 84% వరకు మాత్రమే నమోదవుతుందన్నారు. రాబోయే వారం రోజులలో వీరు కూడా ముందంజ వేసి నూటికి నూరు శాతం ఇండ్ల నుండి చెత్తసేకరణ    ఓ.డబ్ల్యూ.ఎం.ఎస్. విధానం ద్వారా నమోదు కావాలని అందరికి సూచించారు. నగర పరిధిలో డిశంబర్-1 తేదీ నాటికి చెత్తను ఇంటి నుండి నేరుగా సేకరించి డంపర్ బిన్లను పూర్తిగా తొలగించడానికి గాను, తగు ప్రణాళికలు చేసి వచ్చే సోమవారం నాటికి అందించాలని కార్యనిర్వాహక ఇంజినీరు(మెకానికల్), సి.ఎం.ఓ.హెచ్, ఏ.ఎం.ఓ.హెచ్. లను ఆదేశించారు. నగరంలోని వీధులలో ప్రజా ప్రయోగార్ధం ఏర్పరిచిన డంపర్ బిన్లలో వ్యాపార సంస్థలు, హోటల్స్ నుండి వస్తున్న చెత్తను వెయ్యకుండా చూడాలని శానిటరీ ఇన్ స్పెక్టర్లను ఆదేశించారు. అన్ని డంపర్ బిన్లలో గల చెత్తను ప్రతీ రోజూ ఉదయం 10.30గంటల లోపు డంపింగుయార్డుకు తరలించే పనిని రోజు వారీ తప్పనిసరిగా   పరిశీలించాలని కార్యనిర్వాహక ఇంజినీరు(మెఖానికల్)ని ఆదేశించారు. ఇండ్ల నుండి భూగర్భ డ్రైనేజి కి కలపవలసిన కనక్షనుల సర్వేను వచ్చే సమావేశం లోపు పూర్తీ చేసి వివరాలు అందించాలని అందరి శానిటరీ కార్యదర్శులను ఆదేశించారు. డిశంబర్-1 వ తేదీ నాటికల్లా ట్రేడ్ లైసెన్స్ ఫీజు కొత్త వాటికి వేయాలని, వీటిపై 5% పెరుగుదల ఉండేలా చర్యలు చేపట్టాలని   ఏ.ఎం.ఓ.హెచ్.లను, శానిటరీ సూపర్వైజర్లను, శానిటరీ ఇన్ స్పెక్టర్లను ఆదేశించారు. నగర ప్రతిష్ట,  పరిశుభ్రతను పెంపొందించడానికి గాను ప్రజలలో బాధ్యతా పెరగడానికి గాను బహిరంగంగా మల మూత్ర విసర్జన చేసిన వారినుంచి బహిరంగంగా ఉమ్మిన వారి నుంచి, ప్లాస్టిక్ సామగ్రి అమ్మకం దారుల నుండి ఖాళీ జాగాలలో నీటి నిల్వలు చేసి దోమల వృద్ధికి కారణమైన వారి నుండి జరిమానాలు విధించాలని ఆదేశించారు. ప్రతీ రోజు పది వేల రూపాయల పైన జరిమానా విధించిన వార్డు కార్యదర్శులను సభా ముఖంగా కమిషనర్ అభినందించారు. ప్రతీ ఇంటి నుండి చెత్త సేకరణ చేస్తున్నందుకుగాను వినియోగ దారునీ వద్ద నుండి చెత్త సేకరణ నిమిత్తం రూ. 50/- యూజర్ చార్జీలు వసూలు చేయాలని తెలిపారు. రాబోయే స్వచ్ఛ సర్వేక్షణ్-2021 లో మెరుగైన ర్యాంకును సాధించేందుకు ప్రజా భాగస్వామ్య విభాగం ద్వారా  రావలసిన మార్కులను శతశాతం రాబట్టేందుకు కృషి చేయాలని కమిషనర్ అందర్నీ కోరారు. అదనపు కమిషనర్ డాక్టరు వి. సన్యాసి రావు మాట్లాడుతూ స్వచ్చతా యాప్ డౌన్లోడ్ చేసుకొని ప్రతీ నెల రెండు వేల ఫిర్యాదులు నమోదు చేసి వాటిని పరిష్కరించి ప్రజల వద్ద నుండి ఫీడ్ బ్యాక్ నమోదు చేయించాలని సూచించారు. సామాజిక మాధ్యములైన ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్  స్టాగ్రం మొదలగు వాటి ద్వారా సిటిజన్ ఫీడ్ బ్యాక్ పెంచి స్వచ్ఛ సర్వేక్షణ్-2021 ఉత్తమ ర్యాంకు సాధించడానికి కృషి చేయాలని కోరుతూ వచ్చే వారం సమావేశంలో స్వచ్ఛ సర్వేక్షణ్ అంశాలపై రివ్యూ చేపడతామని దానికి అనుగుణంగా సిద్దమై రావాలని అందరికీ సూచించారు.   ఈ సమావేశంలో ఇంకనూ సిఎం.ఓ.హెచ్ డా. కె.ఎస్.ఎల్.జి శాస్త్రీ, అసిస్టెంట్ మెడికల్ అఫీసర్లు  డా. జయరాం, రాజేష్, కార్యనిర్వాహక ఇంజినీరు(మెకానికల్) చిరంజీవి, ఉప కార్యనిర్వాహక ఇంజినీరు శంకరరావు, బయాలజిస్ట్ పైడి రాజు, అసిస్టెంట్ ఇంజినీర్లు(మెఖానికల్), శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్ స్పెక్టర్లు, శానిటరీ కార్యదర్శులు తదితరులు పాల్గోన్నారు.